news18-telugu
Updated: June 11, 2020, 8:23 PM IST
ప్రతీకాత్మక చిత్రం
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై కొందరు దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు . కొండమల్లేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పహాడ్ గ్రామ పరిధిలోని బాపూజినగర్కు చెందిన యాదగిరి, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకుల మధ్య కొంత కాలంగా తగదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదగిరిని చంపేందుకు మిగిలిన ఇద్దరు ప్లాన్ చేశారు. గురువారం సాగర్ రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఒంటిరగా ఉన్న యాదగిరిపై కత్తులతో దాడి చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాల పాలైన యాదగిరి హుటాహుటిన సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స కోసం జిల్లా ఆస్పత్రి తీసుకెళ్లారు. ప్రస్తుతం యాదగిరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
June 11, 2020, 8:17 PM IST