పట్టపగలే దారుణం.. అందరి ముందే కత్తితో..

ప్రతీకాత్మక చిత్రం

ఇన్నాళ్లు కౌలుకు ఇచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడేందుకు వెళ్లిన వారు సైతం భూముల కోసం తిరిగి పల్లెటూళ్ల బాటపడుతున్నారు. ఈ క్రమంలో గెట్టు పంచాయతీలు, పెండింగ్ భూముల తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి.

  • Share this:
    చిన్న అంగుళం భూమి విషయంలో గొడవపడి ప్రాణాలు పొగొట్టుకున్నవారు కొకొల్లలుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు చేయడం.. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశన్నంటడంతో భూములకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న చిన్న పల్లెటూర్లలోనూ భూముల ధరలు అమాంతంగా పెరగడం వల్ల భూతగాదాలు ఎక్కువయ్యాయి. కొద్దిపాటి భూమిని సైతం వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడడంలేదు. ఇన్నాళ్లు కౌలుకు ఇచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడేందుకు వెళ్లిన వారు సైతం భూముల కోసం తిరిగి పల్లెటూళ్ల బాటపడుతున్నారు. ఈ క్రమంలో గెట్టు పంచాయతీలు, పెండింగ్ భూముల తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే భూతగాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

    వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో భూవివాదం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వర్గానికి చెందిన అనంతరాములు, రత్నమ్మలపై మరో వర్గానికి చెందిన అర్జున్‌రావు, నరేందర్ రావు అనే తండ్రి కొడుకులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. రత్నమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. భూమికి సంబంధించిన విషయంలో గత కొన్నిరోజులుగా బంధువుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో ఈ దాడి జరిగింది.(రత్నమ్మపై దాడి చేసిన దృశ్యాలు న్యూస్ 18 టీమ్ వద్ద ఉన్నాయి. కానీ ఆ వీడియోలను చిత్రాల తీవ్రత దృష్ట్యా వాటిని ప్రచురించలేకపోతున్నాం.)
    Published by:Narsimha Badhini
    First published: