అమానుషం..వాట్సాప్‌లో సీఎం కార్టూన్ షేర్ చేసిన రిటైర్డ్ నేవీ అధికారిపై దాడి

రిటైర్డ్ నేవీ అధికారి మదన్ శర్మపై మాస్కల్ ధరించిన పలువురు వ్యక్తులు దాడికి దిగారు. శివసేన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

news18-telugu
Updated: September 12, 2020, 9:18 AM IST
అమానుషం..వాట్సాప్‌లో సీఎం కార్టూన్ షేర్ చేసిన రిటైర్డ్ నేవీ అధికారిపై దాడి
మదన్ శర్మపై దాడి
  • Share this:
ముంబై మహానగరంలో దారుణం జరిగింది. రిటైర్డ్ నేవీ అధికారి మదన్ శర్మపై మాస్కల్ ధరించిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఎగతాళి చేసేలా ఉన్న కార్టూన్ షేర్ చేశారనే అభియోగంతో ఆయనపై దాడి చేశారు. ముంబైలోని తూర్పు కండివాలిలోని మదన్ శర్మ నివాసానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అమానుష దాడిలో మదన్ శర్మ ముఖం, కంటిపై గాయాలు అయ్యాయి. తనపై జరిగిన దాడికి సంబంధించి మదన్ శర్మ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తన రెసిడెన్షియల్ వాట్సాప్ గ్రూప్‌లో కార్టూన్‌ను షేర్ చేశానని మదన్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత తనకు కమలేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి తన వివరాలు అడిగాడని పేర్కొన్నాడు. మధ్యాహ్నం సమయంలో అతను నన్ను బిల్డింగ్ బయటకు పిలిచాడని.. అక్కడ పలువురు తనపై దాడికి దిగారని చెప్పాడు. ఇక, మదన్ శర్మపై దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అందులో మాస్క్‌లు ధరించిన పలువురు అతనిపై దాడి చేసినట్టుగా ఉంది.




ఈ ఘటనపై మాహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటుగా.. శివసేనపై విమర్శలు కురిపిస్తున్నారు."ఈ షాకింగ్ సంఘటన చాలా బాధ కలిగించిన. కేవలం వాట్సాప్‌లో ఓ ఫొటోను పార్వర్డ్ చేసినందుకు గుండాలు మాజీ నేవీ అధికారిపై దాడికి దిగారు. ఉద్దవ్ ఠాక్రే గారు దయచేసి ఈ గుండాలను ఆపండి. ఈ గుండాలపై తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.


మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ట్కల్కర్.. నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసిన అధికార శివసేన.. ఇప్పుడు ఓ మాజీ నేవీ అధికారిపై దాడి చేసి ఆయనను గాయపరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి తన ఇంటి నుంచి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
Published by: Sumanth Kanukuka
First published: September 12, 2020, 9:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading