లాక్‌డౌన్‌లో బయటకు తిరగొద్దన్నందుకు దాడి.. వాలంటీరు మృతి

ఈనెల 20న ఒంటరిగా ఉన్న వాలంటీరు లక్ష్మణరావుపై చిన్నారావు, అతడి తండ్రి సన్యాసి, సోదరుడు రామకృష్ణ కలిసి దాడికి దిగారు.

news18-telugu
Updated: April 29, 2020, 2:44 PM IST
లాక్‌డౌన్‌లో బయటకు తిరగొద్దన్నందుకు దాడి.. వాలంటీరు మృతి
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1815 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.
  • Share this:
లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా బయటకు రావొద్దన్నందుకు ఓ వాలంటీరుపై దాడి చేసిన ఘటన సాలూరులో చోటుచేసుకుంది. సదరు బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పనుకువలస గ్రామపంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీరు కోన లక్ష్మణరావు(23) ఈనెల 18న గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించాడు. ఆ సమయంలో రోడ్డుపై తిరుగుతున్న గ్రామానికి చెందిన గాదిపల్లి చిన్నారావును ఇంటిలోకి వెళ్లాలని సూచించాడు. దాంతో వాలంటీరుకు చిన్నారావుకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఈనెల 20న ఒంటరిగా ఉన్న వాలంటీరు లక్ష్మణరావుపై చిన్నారావు, అతడి తండ్రి సన్యాసి, సోదరుడు రామకృష్ణ కలిసి దాడికి దిగారు.

తీవ్ర గాయాలైన బాధితుడిని తల్లిదండ్రులు సాలూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వాలంటీరు లక్ష్మణరావు ఈనెల 26న పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లక్ష్మణరావుకు నయం కాకపోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయాడని సీఐ ఎస్.సింహాద్రినాయుడు పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: April 29, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading