ఏటీఎంలో చోరీ యత్నం..మంటలు చెలరేగడంతో దొంగలు పరారీ...

చోరీలో భాగంగా గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం తెరిచేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.

news18-telugu
Updated: January 16, 2020, 1:14 PM IST
ఏటీఎంలో చోరీ యత్నం..మంటలు చెలరేగడంతో దొంగలు పరారీ...
ఏటీఎం చోరీ విఫలయత్నం
  • Share this:
ఏటీఎంలో మంటలు చెలరేగిన ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెనుకొండ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరియత్నం జరిగింది. ఈ చోరీలో భాగంగా గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం తెరిచేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనను సీసీ కెమెరాలో గమనించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేయగా, తక్షణమే స్పందించిన సిబ్బంది మంటలకు అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>