Gun shooting at mall : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కొలంబియాలోని దక్షిణ కరోలినా (South Carolina)లోని ఓ షాపింగ్ మాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శనివారం మధ్యాహ్నం షాపింగ్ మాల్ లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. షాపింగ్ మాల్లో జరిగిన కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన వారిని దవాఖానకు తరలించామని..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులంతా 15 నుంచి 73 ఏండ్ల మధ్య వయస్సు గలవారని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఆయుధులు కలిగిన ఉన్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆయుధాలు కలిగి ఉన్నవారు ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా తాము భావించడం లేదని,పథకం ప్రకారమే కాల్పులు జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, గతవారం న్యూయార్క్‌లోని ఓ స్కూల్ వెలుపల జరిగిన కాల్పుల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. కాల్పుల్లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ Fire Accident : 59 మంది చనిపోయిన ఆ థియేటర్ లో మళ్లీ అగ్నిప్రమాదం
మరోవైపు,నాలుగు రోజుల క్రితం న్యూయార్క్ నగరంలోని స్థానిక సబ్ వే స్టేషన్ లో ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నాయి. బ్రూక్లిన్ లోని సబ్ వే స్టేషన్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అక్కడి ప్రాంతమంతా భీతావహాకంగా మారిపోయింది. నెత్తుటి మరకలతో మెట్రో స్టేషన్ ప్లాట్ ఫామ్ ఎర్రగా మారింది. ప్రజలు.. రైల్వే స్టేషన్ (Railway station) నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటన సమయంలో ప్రయాణికుల రద్దీ రైల్వేస్టేషన్ లో ఎక్కువగా ఉంది. వెంటనే అధికారులున రైళ్లను నిలిపివేశారు. ఈ కాల్పుల్లో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.