హోమ్ /వార్తలు /క్రైమ్ /

Purvanchal Expressway : డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొని ఘోర ప్రమాదం.. భారీగా మరణాలు..

Purvanchal Expressway : డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొని ఘోర ప్రమాదం.. భారీగా మరణాలు..

ప్రమాద దృశ్యం

ప్రమాద దృశ్యం

ఉత్తరప్రదేశ్ లో అతిపెద్దదిగా ఉన్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో 8 మంది ప్రయాణికులు చనిపోగా, మరో 20 మందికిపైగా గాయపడ్డారు. వివరాలివే..

దేశచరిత్రలో ఇప్పటిదాకా నిర్మించిన అతి పొడవైన రహదారుల్లో ఒకటిగా, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో అతిపెద్దదిగా ఉన్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే (Purvanchal Expressway)పై ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో 8 మంది ప్రయాణికులు చనిపోగా, మరో 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల పలు ఎక్స్ ప్రెస్ వేలు అందుబాటులోకి రాగా, వాటిలో అతి పెద్దదిగా ప్రత్యేకంగా నిలుస్తుంది పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే. 341 కిలోమీటర్ల ఈ రహదారి దాదాపు 10 జిల్లాలను కలుపుతూపోతుంది. బారాబంకి జిల్లాలో లోని కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నారాయణ్ పూర్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోన ప్రమాదం జరిగింది.

ఘటనాస్థంలో పోలీసులు

Droupadi Murmu : భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం.. కాసేపట్లో.. విశేషాలివే..


వేగంగా వెళుతోన్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొనడటంతో వాటిలో ప్రయాణిస్తోన్న 8 మంది స్పాట్ లోనే చనిపోయారు. రెండు బస్సులు ధ్వంసమైపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమాచంరం తెలిసిన వెంటనే వైద్య, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

ప్రమాదం తర్వాత దృశ్యం

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాద బాధితులను లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఎక్స్‌ప్రెస్‌వే సరిగ్గా ఐదు రోజుల కిందట స్కార్పియో వాహనం టైరు పేలి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Bus accident, Road accident, Uttar pradesh

ఉత్తమ కథలు