Home /News /crime /

AT LEAST 40 FOUND DEAD INSIDE TRUCK IN TEXAS REPORT PAH

America: టెక్సాస్ లో షాకింగ్ ఘటన.. ట్రక్కులో 40 కి పైగా మృతదేహలు..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

America: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. రైలు పక్కన ఒక ట్రక్ ను స్థానికులు గమనించారు. అక్కడికి వెళ్లి చూశారు. అప్పుడు దానిలో కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి.

అమెరికాలో (America) మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రజలు అక్కడ గన్ కల్చర్ లో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ప్రతిరోజు కాల్పుల ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. దుండగులు పాఠశాలలు, సూపర్ మార్కెట్ లు, బహింరంగ ప్రదేశాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల ప్రవాస భారతీయులనే టార్గెట్ గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మరో దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రైలు పట్టాల పక్కన ఒక ట్రక్ ను (Texas Truck) గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసే సరికి.. దానిలో అనేక శవాలు (Dead bodies in truck) ఉన్నాయి. దీంతో అక్కడి వారు షాకింగ్ కు గురయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మెక్సికన్ నుంచి 160 మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ట్రక్ అక్కిడికి ఎలా వచ్చిందో విచారణ చేపట్టారు. అంత మంది విగత జీవులుగా మారడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా గతంలోనే అమెరికాలో కాల్పులు జరిగాయి.

అమెరికా(America)లో తుపాకులు లైసెన్సులు చాలా ఈజీగా దొరుకుతాయి. తుపాకీ హింసను అరికట్టడం కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ తుపాకీ హింస వల్ల ప్రతిరోజూ అమాయకులు చనిపోతున్నారు. ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. గాయపడిన వారిలో 17 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్‌ (Houston‌)లో ఆగంతకులు కాల్పులు (Strangers Firing) జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.

స్థానికంగా పండుగ (candlelight vigil)ను పురస్కరించుకుని ఇక్కడకు చేరిన ప్రజలపై ఆదివారం రాత్రి ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. బేటౌన్ నార్త్ మార్కెట్ లూప్ (North Market Loop in Baytown) సమీపంలో వేడుక కోసం దాదాపు 50 మంది వ్యక్తులు గుమిగూడిన సమయంలో సాయంత్రం 6.40 గంటలకు కాల్పులు జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ (Ed Gonzalez, head of the Harris County Sheriff’s Office) తెలిపారు.

ఈ ప్రజలు సంబరాలు (candlelight vigil) చేసుకుంటున్నారని మరియు గాలిలో బెలూన్‌లను వదులుతున్నారని, ఒక వాహనం అక్కడికి చేరుకుని గుంపుపైకి కాల్పులు (gunfire against vigil) జరిపిందని అతను చెప్పాడు. మరణించిన వ్యక్తికి సుమారు 20-22 సంవత్సరాల వయస్సు ఉంటుందని గొంజాలెజ్ సోమవారం ఉదయం చెప్పారు. గాయపడిన ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు