ఆ రాష్ట్రాల్లో విషాదం నింపిన గణేశ్ నిమజ్జనం.. 28 మంది దుర్మరణం..

గణేశ్ నిమజ్జనంలో ఘోర విషాదం జరిగింది. వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వెళ్లి వేర్వేరు ఘటనల్లో 28 మంది దుర్మరణం చెందారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విషాదం జరిగాయి.

news18-telugu
Updated: September 13, 2019, 3:18 PM IST
ఆ రాష్ట్రాల్లో విషాదం నింపిన గణేశ్ నిమజ్జనం.. 28 మంది దుర్మరణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గణేశ్ నిమజ్జనంలో ఘోర విషాదం జరిగింది. వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వెళ్లి వేర్వేరు ఘటనల్లో 28 మంది దుర్మరణం చెందారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విషాదం జరిగాయి. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలో 17 మంది, మధ్యప్రదేశ్‌లో 11 మంది మృతి చెందారు. అమరావతిలో నలుగురు, రత్నగిరిలో ముగ్గురు, నాసిక్, సింధూదుర్గ్‌, సతారాలో ఇద్దరు, థానె, థులే, బుల్దానా, బాంద్రాలో ఒక్కరు దుర్మరణం చెందారు. మరోవైపు, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యంత ఘోర విషాదం చోటుచేసుకుంది. విగ్రహాల నిమజ్జనానికి బోటులో వెళ్లిన 11 మంది బోటు మునిగి మృత్యువాత పడ్డారు. భోపాల్‌లోని ఖట్లపుర ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.

బోటులో మొత్తం 16 మంది ఉండగా, ఐదుగురిని స్థానికులు కాపాడారు. అయితే, మిగతా వారంతా మృతి చెందారు. ఆ సమయంలో ఘటనా స్థలి వద్ద 40 మంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా వందల సంఖ్యలో మృతి చెందినట్లు సమాచారం.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు