news18-telugu
Updated: August 28, 2019, 7:00 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ బార్లో కాల్పులు జరగడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని కోట్జకోల్కాస్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. చనిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. 15 మంది పురుషులు కూడా ఉన్నారు. కోట్జకోల్కాస్లోని కాబల్లా బ్లాంకో బార్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ జరిగిందని, అది పెద్దది కావడంతో ఓ యువకుడు కాల్పులు జరిపినట్టు తెలిసింది. కాల్పులు జరపడంతో పాటు మద్యాన్ని ధ్వంసం చేసి నిప్పంటించాడు. ఆ మంటల్లో పడి 23 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బార్లో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 28, 2019, 7:00 PM IST