Home /News /crime /

AT LEAST 20 KILLED IN ECUADOR PRISON RIOT PVN

Prison riot : జైలులో ఘర్షణ..20 మంది ఖైదీలు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

20 Killed In prison riot : ప్రస్తుతం జైలులో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు సోమవారం అధికారులు తెలిపారు. గత నెలలోనే ఘర్షణల్లో 316 మంది ఖైదీలు జైలులో మరణించారు. అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
ఈక్వెడార్​ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. క్యూన్కా నగరానికి సమీపంలోని టురి జైలులో ఆదివారం తెల్లవారుజామున ది వోల్వ్స్ అని పిలవబడే ముఠాలోని ఖైదీల మధ్య నాయకత్వ వివాదం కారణంగా ఘర్షణ ప్రారంభమైందని ఈక్వెడార్ జాతీయ పోలీసు దళ కమాండర్ జనరల్ కార్లోస్ కాబ్రెరా విలేకరుల సమావేశంలో విలేకరులతో అన్నారు. .ఖైదీలు ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసుకున్నారని. ఈ ఘర్షణలో 20 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణలో మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్యాట్రికో కార్రిల్లో తెలిపారు.

ఈ ఘర్షణలకు రాజకీయ సంబంధాలున్నట్లు ఆయన అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జైలులో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు సోమవారం అధికారులు తెలిపారు. గత నెలలోనే ఘర్షణల్లో 316 మంది ఖైదీలు జైలులో మరణించారు. అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈక్వెడార్ జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు జరిగి ప్రాణనష్టం జరిగింది. సెప్టెంబరు 2021లో జరిగిన ఆటోమేటిక్ ఆయుధాలు మరియు గ్రెనేడ్‌ లను వాడుతూ ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 118 మంది మరణించిన తర్వాత ఈక్వెడార్ జైలు వ్యవస్థ అత్యవసర పరిస్థితిలో ఉంచబడింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Jails

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు