Buss fell Into A Gorge : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో ఘోరం జరిగింది. ఓ బస్సు (కొండపై లోయలో పడి(Buss Fell Into Gorge) విద్యార్థులతో సహా 20 మంది చనిపోయారు. కులు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని సైన్జ్ లోయలోని జంగ్లా ప్రాంతంలో ఈ ప్రమాదం సోమవారం జరిగింది. బస్సు కులు నుండి సైంజ్కి వెళ్తోన్న సమయంలో ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో సుమారు 35-40 మంది వ్యక్తులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బస్సులో స్కూల్ విద్యార్థులు కూడా ప్రయాణిస్తున్నట్లు కులు డిప్యూటీ కలెక్టర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కులు నుంచి స్పాట్ కి చేరుకున్న రెస్క్యూ బృందాలు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 16 మృతదేహాలను బయటికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.