చిత్తూరు ఆంధ్రా బ్యాంకు చోరీలో నిందితుల అరెస్టు...అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి...

అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసిన బ్యాంకు ఉద్యోగి రమేష్ ఆచారి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. సంచలనం రేపిన యాదమరి ఆంధ్రాబ్యాంకులో బంగారు ఆభరణాల చోరీ కేసు చిక్కుముడిని విప్పిన పోలీసులకు బ్యాంకు యాజమాన్యం కృతజ్ఞత తెలిపింది.

news18-telugu
Updated: October 30, 2019, 7:11 PM IST
చిత్తూరు ఆంధ్రా బ్యాంకు చోరీలో నిందితుల అరెస్టు...అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన చిత్తూరుజిల్లా మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు చోరీ కేసును పోలీసులు ఛేదించారు.అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసిన బ్యాంకు ఉద్యోగి రమేష్ ఆచారి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. సంచలనం రేపిన యాదమరి ఆంధ్రాబ్యాంకులో బంగారు ఆభరణాల చోరీ కేసు చిక్కుముడిని విప్పిన పోలీసులకు బ్యాంకు యాజమాన్యం కృతజ్ఞత తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 14న బ్యాంకులో 18 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదు, సీసీ కెమెరాలకు సంబంధించిన హర్డ్ డిస్కులు చోరీకి గురవగా. ఆంధ్రాబ్యాంకు ఉన్నతాధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ను ముందస్తుగా మాయం చేశారు. బ్యాంకు ప్రధానద్వారం, లోపలి లాకర్‌ తాళాలు యథాతథంగా ఉండగా లాకర్‌లోని ఆభరణాలు మాయం కావడంతో.. కచ్చితంగా బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉంటుందనే కోణంలో పోలీసులు విచారించారు. విచారణలో భాగంగా బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న విగ్రహాల రమేశ్‌ ఆచారిపై అనుమానాలు రావడంతో పోలీసులు అతన్ని విచారించగా...పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అప్రైజర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ వ్యక్తిగతంగా ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడంతో తనకు తెలిసిన నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో తనఖా పెట్టించి రూ. కోటి 30 లక్షల రుణం తీసుకున్నాడు. అలాగే బ్యాంకు లాకర్ల తాళాలను తీసుకుని నకిలీ తాళాలను సిద్ధం చేసుకొని నగదు, ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఆభరణాలను కరిగించి ఆరు ముద్దలుగా తయారు చేసి విక్రయిస్తుండగా నిందితుడిని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.

First published: October 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...