ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుంది. భక్తులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి లోయలాంటి ప్రదేశంలో పడిపోయింది. ఈ ఘటన ట్రక్‌లో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని ఎటావాలోని బధేపూర సమీపంలో చోటుచేసకుంది. వివరాలు.. పినహట గ్రామానికి చెందిన భక్తులు లఖ్నా దేవీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆగ్రా నుంచి గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ట్రక్ దాదాపు 50 మంది వరకు భక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే శనివారం వాహనం బధేపూర సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మృతుల వివరాలను గుర్తించాల్సి ఉంది.
ఇక, ఈ ప్రమాదంలో గాయపడినవారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకని సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానికులు సహాయంతో లోయలో పడిపోయిన వారిని పైకి తీసుకుచ్చేందుకు ప్రయత్నించారు. తాడుల ద్వారా వారిని పైకి చేర్చారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎటావా జిల్లా ఆస్పత్రికి, సైఫీ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agra, Uttar pradesh