బాంబు పేలుడుతో బస్సులో 10 మంది దుర్మరణం

బస్సును బాంబు ఢీకొనడం వల్ల 10 మంది చనిపోయారు. మరో 27 మంది గాయపడ్డారు.

news18-telugu
Updated: October 7, 2019, 7:36 PM IST
బాంబు పేలుడుతో బస్సులో 10 మంది దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బస్సును బాంబు ఢీకొనడం వల్ల 10 మంది చనిపోయారు. మరో 27 మంది గాయపడ్డారు. తూర్పు అప్ఘనిస్తాన్‌లో ఈ దాడి జరిగింది. ఆర్మీలో కొత్తగా చేరే వారిని బస్సులో తీసుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ మోటార్ సైకిల్‌కు బాంబు అమర్చినట్టు తెలిసింది. ఆ మోటార్ సైకిల్‌తో బస్సును ఢీకొట్టడంతో బస్సు బాగా దెబ్బతింది. సుమారు 10 మంది చనిపోయారు. అందులో ఓ బాలుడు కూడా ఉన్నట్టు సమాచారం. బస్సు మీద బాంబు దాడిని అధికారులు ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లో ఇలాంటి దాడి జరిగింది. సెలవులు ముగించుకుని విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ టెర్రరిస్ట్ కారు బాంబు పేల్చడంతో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కత్తులతో కేక పుట్టిస్తున్న హీరోలు..

Published by: Ashok Kumar Bonepalli
First published: October 7, 2019, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading