హోమ్ /వార్తలు /క్రైమ్ /

జాతకం చెప్పే పేరుతో పాడుపని.. ల్యాప్‌ట్యాప్‌లో వీడియోలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

జాతకం చెప్పే పేరుతో పాడుపని.. ల్యాప్‌ట్యాప్‌లో వీడియోలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

జాతకాల పేరుతో తన వద్దకు వచ్చే మహిళలను.. వారికి తెలియకుండానే మోసం చేస్తున్న ఓ జ్యోతిష్కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  జాతకాల పేరుతో తన వద్దకు వచ్చే మహిళలను.. వారికి తెలియకుండానే మోసం చేస్తున్న ఓ జ్యోతిష్కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. . తన వద్దకు వచ్చే మహిళల ఫొటోలు సేకరించి.. వాటిని మార్ఫింగ్ చేసి పోర్న్‌ వీడియోలు క్రియేట్ చేసేవాడు. అయితే ఆ వీడియోలకు సంబంధించిన ఓ మెమొరీ కార్డు ఒకరికి దొరకడంతో అతని భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాలు.. విష్ణు అనే 29 ఏళ్ల జ్యోతిష్కుడు కట్టకడ పోలీసు స్టేషన్ పరిధిలో నెయాట్టింకర‌లో జాతకాలు చెబుతూ జీవనం సాగించేవాడు. అయితే అక్కడికి వచ్చే మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ ఫొటోలు, వీడియోలు తయారుచేసేవాడు.ఇలా చేసిన మార్ఫింగ్ వీడియోలను పెన్‌డ్రైవ్, మొమెరీ కార్డులలో స్టోర్ చేసేవాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ల్యాప్‌ట్యాప్‌లో ఈ వీడియోలు చూసేవాడు.

  అయితే అతని సంస్థకు వచ్చిన ఒకరికి ఓ మొమెరీ కార్డు దొరికింది. దానిని ఓపెన్ చేసి చూడగా.. ఓ మహిళ మార్ఫింగ్ వీడియోలు కనిపించాయి. మరింతగా శోధన జరపగా.. చాలా మంది మహిళలకు సంబంధించిన మార్ఫ్‌డ్ వీడియోలు అందులో ఉన్నాయి. దీంతో ఆ అశ్లీల వీడియోలకు సంబంధించిన ఆధారాలతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఇక, నిందితుడు విష్ణు కేరళ, తమిళనాడులోని చాలా ఆలయాల్లో పూజలు చేసేవాడు. అయితే ఏడాది క్రితం అతడు ఆర్యనాడ్‌లోని ఒక ఆలయంలో పూజారిగా ఉన్న సమయంలోనే అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విష్ణు దగ్గరికి జాతకాల చెప్పించుకునేందుకు వెళ్లిన మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  First published:

  Tags: Astrology, Crime news, Kerala

  ఉత్తమ కథలు