అమీర్‌పేటలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పట్టుబడిన ఓ ప్రభుత్వ కీలక అధికారి..

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో ఇంతటి లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ వ్యభిచారం చేస్తున్నారు. అమీర్‌పేటలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయగా ఆదాయ పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి పట్టుబడ్డారు.

news18-telugu
Updated: May 28, 2020, 6:01 PM IST
అమీర్‌పేటలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పట్టుబడిన ఓ ప్రభుత్వ కీలక అధికారి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ భయంతో ఓవైపు ప్రపంచమంతా వణికిపోతోంది. కానీ కొంతమంది మాత్రం సభ్యసమాజం తల దించుకునే పనులు చేస్తున్నారు. ఎక్కడ కరోనా వైరస్ విజృంభిస్తోందోనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే భౌతికదూరం, మాస్కలు వినియోగం, శానిటైజర్ల వాడకాన్ని తప్పనిసరి చేశాయి. ప్రభుత్వం విధించిన భౌతికదూరం సంగతేమో గానీ.. వేరే మహిళలతో ప్రభుత్వ అధికారులే అత్యంత సన్నిహితంగా మెలుగుతుండడంపై నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో ఇంతటి లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. అమీర్‌పేటలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయగా ఆదాయ పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి పట్టుబడ్డారు. నిర్వాహకుడు తప్పించుకోగా, విటుడిగా వెళ్లిన ఆదాయపు పన్ను శాఖ అధికారి నాగేంద్రభూక్యాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను పోలీసులు వారి చెర నుంచి విడిపించారు. అయితే నాగేంద్ర భూక్యా ముంబైలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్టు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.
First published: May 28, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading