Home /News /crime /

ASSAM PADMA AWARDEE BOOKED FOR ALLEGED RAPE OF FOSTER CHILD COURT GRANTS PRE ARREST BAIL MKS

Padma awardee : కూతురిపై అత్యాచారం.. పద్మ అవార్డు గ్రహీత పాడు పని.. హైకోర్టు షాకింగ్ తీర్పు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పేద పిల్లల కోసం ఆశ్రమం నడిపిస్తోన్న ఆ పెద్ద మనిషి దేశంలోనే ఉన్నత పౌర పురస్కార గ్రహీత. ఆయనలో మరో చీకటి కోణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్ల అనే కనికరం లేకుండా దత్తత తీసుకున్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది పాటు చాలా సార్లు పాపపై లైంగిక దాడి చేసి, ఆమెను వదిలించుకోవాలని చూశాడు.. కానీ అనూహ్య రీతిలో..

ఇంకా చదవండి ...
సామాజిక సేవకుడిగా, చిన్న పిల్లల సంరక్షకుడిగా గొప్ప పేరు పొందారాయన.. పేద బాలలకు ఆయన చేస్తోన్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం.. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం పద్మ అవార్డుతో సత్కరించింది.. దేశ, విదేశాల నుంచి అవార్డులు, రివార్డులెన్నో ఆయనకు అందాయి.. భార్యతోడుగా పేద పిల్లల కోసం ఆశ్రమం నడిపిస్తోన్న ఆ పెద్ద మనిషిలో మరో చీకటి కోణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్ల అనే కనికరం లేకుండా దత్తత తీసుకున్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది పాటు చాలా సార్లు పాపపై లైంగిక దాడికి పాల్పడిన ఆ పెద్ద మనిషి చివరికి ఆమెను వదిలించుకోవాలని చూశాడు.. కానీ అనూహ్య రీతిలో నేరం బయటపడింది. బాలికపై రేప్ జరిగినట్లు మెడికల్ రిపోర్టుల్లోనూ నిర్ధారణ అయింది. అయితే, ఇదంతా తన పాపులారిటీని చెడగొట్టడానికి కొందరు చేస్తోన్న కుట్ర అని అతను వాదిస్తున్నాడు. అనూహ్యంగా కోర్డు సైతం ఆయన వాదనకే మొగ్గుచూపింది. ముందస్తు అరెస్టు నుంచి ఆ పద్మ అవార్డీకి ఉపశమనం కల్పించింది కోర్టు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సలచంనం రేపుతోన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

అస్సాంకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, అనాథ పిల్లలపాలిట తండ్రిగా పేరు పొందిన పద్మ అవార్డు గ్రహీత అనూహ్య వివాదంలో ఇరుక్కున్నారు. తన ఆశ్రమంలో పెంచుకునే పిల్లల్ని కూతుళ్లుగా దత్తత తీసకునే ఆయన.. అందులో ఓ చిన్నారిపై లైంగిక అకృత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ ఘోరానికి సంబంధించి అస్సాం పోలీసులు ఆ వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ముస్లిం మహిళల వేలం: 18ఏళ్ల శ్వేత అరెస్ట్ -Bulli Bai సృష్టికర్త విశాల్ ఝా -సిక్కుల పని కాదుమహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ కేంద్రాల నుంచి కొందరు బాలికలను ఆయన దత్తత తీసుకుని సాకుతున్నారు. నిబంధనల ప్రకారం ఏడాది దత్తత గడువు ముగిసిన ప్రతిసారి రెన్యూవల్ చేయించుకుని మళ్లీ పిల్లలను తన వద్దే ఉంచుకుంటారు. అయితే, ఓ ఇద్దరు బాలికల విషయంలో మాత్రం ఆయన తీరు మరోలా ఉంది. దత్తత గడువు ముగిసిన తర్వాత ఆ బాలికలను వదిలించుకోడానికి ప్రయత్నించారాయన. దీంతో అసలేం జరిగిందని శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆరా తీయగా, అత్యాచారం విషయం బయటపడింది.

కూతురు చెప్పిన మాట తట్టుకోలేక స్కూల్ డైరెక్టర్‌పై ఆర్మీ జవాన్ కాల్పులు.. కానీ బుల్లెట్ తగిలింది భార్యకు!ఆశ్రమంలో ఉన్న ఏడాది కాలంలో పెంపుడు తండ్రి(పద్మ అవార్డీ) తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ బాలిక అధికారులకు చెప్పింది. అంత పెద్ద మనిషి ఇలా చేయడమేంటనే గందరగోళంలోనే బాలికకు వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు టెస్టుల్లో నిర్ధారణ అయింది. ఈ ఘోరానికి సంబంధించి గతేడాది డిసెంబర్ 17న అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కూతురిలా పెంచుకున్న బాలికపై అత్యాచారం చేశాననే ఆరోపణ పచ్చి అబద్ధమని నిందితుడైన పద్మ అవార్డీ వాదించారు. తన పరువుకు భంగం కలిగించాలనే దురుద్దేశంతో కావాలనే కొందరు ఇలా తప్పుడు కేసు బనాయిస్తున్నారంటూ ఆయన గువాహటి హైకోర్టును ఆశ్రయించారు.

చదువుల బాహుబలి: lockdown టైమ్‌లో 145 డిగ్రీలు సాధించాడు.. అన్నీ ప్రపంచ టాప్ వర్సిటీలే!పద్మ అవార్డీ అయినప్పటికీ ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని హైకోర్టు వ్యాఖ్యనించింది. అయితే, శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు ఫైల్ చేసిన రిపోర్టుల్లో పొరపాట్లను గుర్తిస్తూ మొత్తానికి నిందితుడికి ముందస్తు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ డిసెంబర్ 28న కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ ఏడాది జనవరి 7కు వాయిదా వేసిన న్యాయస్థానం.. ఈ గడువులోగా నిందితుడు పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందేనని షరతు విధించింది. మెడికల్ రిపోర్టుల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు స్పష్టంగా నిర్ధారణ అయినప్పటికీ, టెక్నికల్ కారణాలను చూపుతూ అరెస్టు నుంచి బయటపడ్డారా పెద్ద మనిషి. పద్మ అవార్డీ నేరానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను పోగేస్తోన్న పోలీసులు ఈనెల 7న జరిగే విచారణలో వాటిని కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. పాడు పనికి పాల్పడిన ఆ పెద్ద మనిషి పేరును మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
First published:

Tags: Assam, Minor girl, Minor girl raped, Padma Awards

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు