ఆసుపత్రిలో దారుణం... నిద్రపోతున్న మహిళా రోగులపై మేల్ నర్స్ లైంగిక దాడి...

నమూనా చిత్రం

ప్రాణాలు కాపాడాల్సిన నర్సులు పేషెంట్లపై అఘాయిత్యాలకు పాల్పడితే... ఇక ఆ బాధితుల్ని కాపాడేదెవరు? బలమైన చట్టాలున్నాయని మనం అనుకుంటున్నామే తప్ప... అక్రమార్కులెవరూ వాటికి బయపడట్లేదు. నేరాలూ, ఘోరాలూ జరుగుతూనే ఉన్నాయి.

  • Share this:
అసోం రాజధాని గౌహతిలో... డిసెంబర్ 31న జరిగిన దారుణం ఇది. బారువా కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ముగ్గురు పేషెంట్లపై అఘాయిత్యానికి పాల్పడిన 26 ఏళ్ల నర్సును తాజాగా అరెస్టు చేశారు పోలీసులు. ఆ దుర్మార్గుడి పేరు కమల్ కాంతి సేన్ చౌదరి. త్రిపురలోని బెలోనియా ప్రాంతానికి చెందినవాడు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేషెంట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైంది. పారిపోయిన నర్స్ కోసం పోలీసులు వేటాడారు. త్రిపుర వెళ్లిపోయిన కాంతి సేన్, అక్కడ తన సొంత ఊరికి కాకుండా... వేరే ఊళ్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. కాంతి సేన్ మొబైల్ నంబర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. రెండు వారాలపాటూ... సిమ్, తీసేసి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసిన కేటుగాడు... ఇప్పుడు దాన్ని తిరిగి ఆన్ చెయ్యడంతో... ట్రేస్ చెయ్యగలిగారు.

త్రిపుర పోలీసులతో కాంటాక్ట్‌లో ఉన్న అసోం పోలీసులు... పక్కా ప్లాన్ ప్రకారం నిఘా పెట్టి కాంతి సేన్‌ను పట్టుకున్నారు. లైంగిక వేధింపులు మాత్రమే కాక... అతను ఆస్పత్రిలో చోరీ కూడా చేసినట్లు తెలిసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... పేషెంట్ల భద్రతపై ఆస్పత్రులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు, పూర్తి బ్యాక్ గ్రౌండ్, నేర ప్రవృత్తి అన్నీ పరిశీలించాలని కోరుతున్నారు.

Video: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ భేటీ
First published: