'బీఫ్ అమ్మాడని పంది మాంసం పెట్టారు'..వృద్ధుడి చావబాదిన అల్లరి మూకలు

ఆ వీడియోలో షౌకత్ అలీ బురద నీళ్లలో మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. తనను వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డారు. కానీ అక్కడున్న ఎవరూ కనుకరించలేదు.

news18-telugu
Updated: April 9, 2019, 3:39 PM IST
'బీఫ్ అమ్మాడని పంది మాంసం పెట్టారు'..వృద్ధుడి చావబాదిన అల్లరి మూకలు
నమూనా చిత్రం
  • Share this:
గతంలో పోలిస్తే దేశంలో మూక దాడులు కొంతమేర తగ్గాయి. గోరక్షకుల ముసుగులో కొందరు దుండగుల చేస్తున్న దాడులు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. ఐతే అంతా ప్రశాంతంగా ఉందనుకున్న వేళ అసోంలో దారుణం జరిగింది. బీఫ్ అమ్ముతున్నాడనే అనుమానంతో 68 ఏళ్లు వృద్ధుడిని స్థానికులు చితక్కొట్టారు. వృద్ధుడని కనికరం కూడా లేకుండా చావబాదారు. తనను వదిలిపెట్టాలని కాళ్లావేళ్లా పడ్డా వదలిపెట్టలేదు. ఐదారు మంది కలిసి ఒక్కడిపై దాడిచేశారు. బిస్వాంత్ జిల్లా ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

షౌకత్ అలీ అనే వృద్ధుడు బీఫ్ అమ్ముతున్నాడని తెలుసుకున్న కొందరు దుండగులు అతడిపై దాడిచేశారు. కొడుతూనే షౌకత్ అలీపై ప్రశ్నల వర్షం గుప్పించారు. బీఫ్ అమ్మేందుకు నీకు లైసెన్స్ ఉందా? బంగ్లాదేశ్ నుంచి ఇక్కడకు వచ్చావా? జాతీయ పౌర రిజిస్టర్ (NRC)లో నీరు పేరు ఉందా? అంటూ నిలదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో షౌకత్ అలీ బురద నీళ్లలో మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. తనను వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డారు. కానీ అక్కడున్న ఎవరూ కనుకరించలేదు. అంతేకాదు బీఫ్ అమ్మినందుకు శిక్షగా పంది మాంసం తినాలని బలవంతపెట్టారు.

దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన షౌకత్ అలీ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం సత్ప్రవర్తన ఒప్పందం కింద సంతకాలు చేయించుకొని వదలిపెట్టినట్లు తెలుస్తోంది. ఐతే పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. వృద్ధుడిపై దాడిచేసిన అల్లరిమూకను శిక్షించకుండా ఎందుకు వదిలిపెట్టారని మండిపడుతున్నారు.

కాగా, ఫిబ్రవరి 7న కర్నాటకలోని హసన్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. క్యాంటిన్‌లో బీఫ్ వంటకాలు పెడుతున్నారన్న ఆరోపణలతో ఇద్దరు మహిళలపై బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం క్యాంటిన్‌కు నిప్పుపెట్టారు. సక్లేశ్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఆ ఘటన సంచలన రేపిన విషయం తెలిసిందే. మూకదాడులకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసినా..పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
First published: April 9, 2019, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading