హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియురాలి పట్ల పైశాచికం.. దుర్గాపూజకు వేరొకరితో వెళ్లిందని.. ఏంచేశాడంటే..

ప్రియురాలి పట్ల పైశాచికం.. దుర్గాపూజకు వేరొకరితో వెళ్లిందని.. ఏంచేశాడంటే..

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో నిందితుడు

Assam: దుర్గాపూజ రోజున బాలిక మరోక యువకుడితో కలిసి పూజకు వెళ్లింది. ఇది కాస్త అతని ప్రియుడికి తెలిసింది. దీంతో అతను ఆమెను కిడ్నాప్ చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Assam, India

మనలో చాలా మంది యువత ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు. అయితే.. కొందరు ప్రేమించిన వారికోసం రకారకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. వారికి ఏంకావాలో అన్ని తెచ్చిపెడుతుంటారు. ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఏదైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇంకొందరు మాత్రం ప్రేమించిన వారిని టార్చర్ చేస్తుంటారు. ఇతరులతో మాట్లాడితే అనుమానంగా ట్రీట్ చేస్తుంటారు. ఈ క్రమంలో దాడులు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. అసోంలో (Assam)  దారుణ ఘటన జరిగింది. కాచర్ జిల్లాలో చోటు చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉండే మైనర్ బాలిక అక్టోబర్ 3న మరోకరితో కలిసి దుర్గాపూజకు వెళ్లింది. అయితే.. అది కాస్త ఆమెను ప్రేమిస్తున్న యువకుడికి తెలిసింది. దీంతో అతను ఆమెతో వెళ్లి, ఆమెతో మాట్లాడాలంటూ మరో చోటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను హత్య చేయడానికి కూడా ప్రయత్నించాడు.

అప్రమత్తమైన బాలిక అతికష్టం మీద అతని నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత జరిగిన దారుణం గురించి ఇంట్లో వారికి చెప్పింది. ఈ క్రమంలో బాలిక ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేశాడని, బట్టలు చింపేశాడని చెప్పింది. అంతే కాకుండా బ్యాగులో వేసుకుని,  చంపడానికి కూడా ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అయితే.. పోలీసులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అక్టోబరు 6 న అరెస్టు చేశారు. ప్రస్తుతం బాలికను సిల్చార్ లోని మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో సీరియస్ కండీషన్ లో ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) దారుణ ఘటన చోటుచేసుకుంది.

నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా పడింది. కాగా, ఛత్తీస్ గఢ్ లోని మనేంద్రగఢ్ జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం ప్రెసిడెంట్ షానవాజ్, ఒక బాలికను మాయమాటలు చెప్పి హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను బంధించి అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. మరికొందరిని అక్కడికి ఫోన్ చేసి రప్పించాడు. వారంతా కూడా బాలికపై సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఘటన బయటపడితే చంపుతామంటూ బాలికను బెదిరించారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా బాలిక భయంతోనే ఉండిపోయింది. అయితే.. చివరకు కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి చిర్మిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ యువజన విభాగం ప్రెసిడెంట్, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

First published:

Tags: Assam, Crime news

ఉత్తమ కథలు