13 ఏళ్ల బాలికపై ఐపీఎస్ అధికారి నీచపు పని.. చార్జ్ షీట్‌లో అభియోగాలు.. అంతలోనే ఊహించని విధంగా..

ప్రతీకాత్మక చిత్రం

ఓ ఐపీఎస్ అధికారి 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసకు సంబంధించి అతనిపై చార్జ్‌షీట్‌ కూడా దాఖలైంది.

 • Share this:
  ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి బుద్ది వక్రమార్గం పట్టింది. మహిళలకు రక్షించాల్సిన అతడు.. 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసకు సంబంధించి అతనిపై చార్జ్‌షీట్‌ కూడా దాఖలైంది. మైనర్ బాలికపై అతడు లైంగిక హింసకు పాల్పడారనే దానికి ఆధారాలు ఉన్నట్టు కూడా చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఊహించని విధంగా.. అతనిపై కేసు కోర్టులో ఉండగానే అతనికి ఎస్పీగా(Superintendent of Police) పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. వివరాలు.. అసోంకు చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల బాలికపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు అందింది.

  2019 డిసెంబర్ 31న నిందితుడి ఇంట్లో జరిగిన ఓ పార్టీ సందర్భంగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత 2020 జనవరి 3వ తేదీన మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి కేసు నమోదైంది. అనంతరం అసోం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మైనర్ బాలికపై లైంగిక హింస జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లభించడంతో చిన్నారులపై లైంగిక నేరాల నియంత్రణ చట్టం(POCSO Act), ఐపీసీ 354, 354A కింద నిందితుడిపై అభియోగాలు మోపారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 31 చార్జ్ షీట్ కూడా నమోదైంది. ఆ చార్జ్ షీట్‌లో.. నిందితుడు సంబంధిత సెక్షన్ల కింద తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిరూపించడాని తగిన ఆధారాలు కనుగోబడ్డాయని ఉందని NDTV పేర్కొంది.

  ఈ క్రమంలోనే లైంగిక హింస కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ ఐపీఎస్ అధికారి కొత్త పోస్టింగ్‌పై అస్సోం ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. గతంలో గౌహతిలో పనిచేసిన ఆ ఐపీఎస్.. ఇప్పుడు బోడోల్యాండ్‌లోని ఓ జిల్లాకు ఎస్పీగా నియమించారు.
  Published by:Sumanth Kanukula
  First published: