గజ్వేల్‌లో ఉద్యోగిని దారుణ హత్య.. వారం రోజుల్లో పెళ్లి..

మృతురాలిని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన 24 ఏళ్ల దివ్యగా గుర్తించారు. ఆమె స్థానిక ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంకు)లో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

news18-telugu
Updated: February 18, 2020, 10:28 PM IST
గజ్వేల్‌లో ఉద్యోగిని దారుణ హత్య.. వారం రోజుల్లో పెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. గజ్వేల్ పట్టణంలో ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా చంపేశారు. గొంతుకోసి దారుణంగా హతమార్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన 24 ఏళ్ల దివ్య గజ్వేల్‌లోని ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంకు)లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. గజ్వేల్‌లో అద్దె గదిలో నివసిస్తోంది. మరో వారం రోజుల్లో దివ్య వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దివ్యను చంపేశారు. రూమ్‌లోనే గొంతుకోసి హత్య చేశారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పనిచేసే బ్యాంకుతో పాటు పట్టణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దివ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 26న పెళ్లికి అంతా సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ ఘోరం జరగడంతో.. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు