హైదరాబాద్‌లో దారుణం.. ఆర్టీసీ బస్సులో మహిళకు కత్తిపోట్లు

సీటు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దదవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన దుండగుడు.. జేబులో నుంచి కత్తి తీసి ఆమెపై దాడి చేశాడు. అనంతరం బస్సు దిగి పారిపోయాడు.

news18-telugu
Updated: February 18, 2020, 6:04 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ఆర్టీసీ బస్సులో మహిళకు కత్తిపోట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుడిని కత్తితో పొడిచాడు దుండగుడు. బేగంబజార్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనురాధ అనే మహిళ బేగంబజార్ సమీంలో ఓ ఆర్టీసీ బస్సులోకి ఎక్కింది. కూర్చునేందుకు సీటు లేకపోవడంతో.. లేడీస్ సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి సీటు ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆ సీటు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దదవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన దుండగుడు.. జేబులో నుంచి కత్తి తీసి ఆమెపై దాడి చేశాడు. అనంతరం బస్సు దిగి పారిపోయాడు. కత్తి దాడిలో గాయపడిన బాధితురాలికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై బాధితురాలితో పాటు డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు