అదనపు కట్నం కోసం.. భార్యపై ఎంత ఘాతుకానికి తెగించాడంటే..

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్ కుమార్‌తో 2018లో తన వివాహం జరిగినట్టు పేర్కొంది. తమది కూడా గుంటూరు జిల్లానే అని చెప్పింది.

news18-telugu
Updated: December 16, 2019, 1:14 PM IST
అదనపు కట్నం కోసం.. భార్యపై ఎంత ఘాతుకానికి తెగించాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పట్టణంలో దారుణం జరిగింది. ఎంపీడీవో అయిన తన భర్త జగదీష్ అనిల్ కుమార్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిత్యం మద్యం సేవించడం.. తనపై దాడి చేయడం అనిల్ కుమార్‌కు కామన్ అయిపోయిందని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం మత్తులో కత్తితో తనపై దాడి చేశాడని.. రెండు చేతులపై కత్తితో లోతైన గాట్లు పెట్టాడని కన్నీటి పర్యంతమమయ్యారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్ కుమార్‌తో 2018లో తన వివాహం జరిగినట్టు పేర్కొన్నారు. తమది కూడా గుంటూరు జిల్లానే అని చెప్పారు. ప్రస్తుతం అతను ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తుండటంతో.. అక్కడే నివాసం ఉంటున్నట్టు చెప్పారు. అదనపు కట్నం కోసం గతంలోనూ చాలాసార్లు దాడికి పాల్పడ్డాడని.. కొన్నిసార్లు హత్యాయత్నం కూడా చేశాడని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
Published by: Srinivas Mittapalli
First published: December 16, 2019, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading