చిత్తూరు జిల్లాలో దారుణం.. అద్దె ఇంటిలోని వంటగదిలో ఏఎస్ఐ..

2019 సెప్టెంబరులో పెనమూరు నుంచి కుప్పంకు బదిలీపై వచ్చారు. అయితే కుప్పం మండలం నడుమూరు చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.

news18-telugu
Updated: June 4, 2020, 6:50 AM IST
చిత్తూరు జిల్లాలో దారుణం.. అద్దె ఇంటిలోని వంటగదిలో ఏఎస్ఐ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏమైందో ఏమోగానీ ఓ ఏఎస్ఐ తన అద్దె ఇంటిలోని వంట గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరుకు చెందిన రాజేంద్ర(57) ఏఎస్ఐగా కుప్పం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. కుప్పం పట్టణంలోని గాండ్ల వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 2019 సెప్టెంబరులో పెనమూరు నుంచి కుప్పంకు బదిలీపై వచ్చారు. అయితే కుప్పం మండలం నడుమూరు చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాజేంద్ర రోజువారీగా డ్యూటీకి రావాల్సి ఉన్నా హాజరుకాలేదు. ఉదయం నుంచి పోలీసులు ఫోన్ చేస్తున్నా తీయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కుప్పం పట్టణం గాండ్లవీధిలోని అద్దె ఇంటికి వెళ్లి చూశారు. ఇంటి తలుపులు తీసి ఉండగా, లోపలికి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఏఎస్ఐ రాజేంద్ర వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇదిలావుంటే.. పది రోజుల క్రితమే చిత్తూరు టూటౌన్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. కానీ లాక్‌డౌన్ కారణంగా రిలీవ్ కాలేకపోయాడు. ఇంతలోనే ఇలా జరిగిందని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
First published: June 4, 2020, 6:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading