Home /News /crime /

AS THE FEAR OF PARENTS REJECT MARRIAGE PROPOSAL LOVERS COMMITS SUICIDE IN PRAKASAM DISTRICT SSR

Lovers In Prakasam: ప్రేమికుల దినోత్సవం ముందు రోజే ఎంత పని జరిగింది దేవుడా..!

సాయి సతీష్, షకీనా

సాయి సతీష్, షకీనా

ప్రకాశం జిల్లాలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే...

    ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. దేశాయిపేటలోని లోహియాపురానికి చెందిన మైలవరపు సాయి సతీష్(20) దేశాయిపేటలోని ఓ జీడిపప్పు మిల్లులో పనిచేస్తున్నాడు. పదో తరగతి వరకూ చదివిన గొర్రెముచ్చు షకీనా(19) కూడా అదే మిల్లులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అయితే.. ప్రేమించుకున్నంత సులువుగా తమ పెళ్లికి పెద్దలను ఒప్పించలేమన్న భయం ఈ జంటను వెంటాడింది. ఆ భయమే ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైంది. కలిసి బతికే పరిస్థితులు లేవని భావించిన ఈ ప్రేమ జంట కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దేశాయిపేటలోని సాయిబాబా గుడి వెనుక రైలు పట్టాల వద్దకు శనివారం ఈ జంట చేరుకున్నారు.

    కేరళ సూపర్‌ఫాస్ట్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సాయి సతీష్ మృతదేహం లభించగా, షకీనా మృతదేహం రైలు ఇంజిన్‌కు చిక్కుకుని చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో లభ్యమైంది. ఈ ఘటన సతీష్, షకీనా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించడం పాపం కాదని, కానీ ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగల్చొద్దని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    చనిపోవాలన్న ఆలోచన వచ్చిన సమయంలో ఒక్క క్షణం ఆలోచించినా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. జీవితంలో ప్రేమ ఒక భాగమే కానీ, ప్రేమే జీవితం కాదని అంటున్నారు. ప్రేమికులు పెద్దలను ఒప్పించి వారి ప్రేమకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలే తప్ప ఇలా విషాదాంతాలుగా మిగిలిపోకూడదని చెబుతున్నారు. జీవితం ఒక్క మనకే పరిమితం కాదని, చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవడం మేలని యువతీయువకులకు పెద్దలు సూచిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Lovers, Lovers suicide, Prakasam, Valentines day, Valentines Day 2021

    తదుపరి వార్తలు