Home /News /crime /

ARYANAD BRIDE FOUND HANGING AT HER HUSBAND HOUSE AND THE DECEASED WAS IDENTIFIED AS ADITYA WIFE OF MITHUN A NATIVE OF ANIYILAKKADAVU SSR

Daughter-In-Law: ఆగస్ట్ 25న వీళ్లిద్దరికీ పెద్దలు పెళ్లి చేశారు.. కానీ ఈ కోడలు ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు..

మిధున్, ఆద్య (ఫైల్ ఫొటో)

మిధున్, ఆద్య (ఫైల్ ఫొటో)

ఆ యువతికి పెళ్లై రెండు నెలలు కూడా గడవలేదు. అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించింది. ఈ విషాద ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.

    తిరువనంతపురం: ఆ యువతికి పెళ్లై రెండు నెలలు కూడా గడవలేదు. అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించింది. ఈ విషాద ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునంతపురం జిల్లా ఆర్యనాడ్ అనే గ్రామానికి చెందిన ఆద్య అనే 23 ఏళ్ల యువతికి ఆగస్ట్ 25న ఆదిత్య అనే యువకుడితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవు. అత్తింట్లో కూడా కోడలిని బాగానే చూసుకున్నారు. అలాంటప్పుడు ఆద్య ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆద్య తన భర్త పని మీద బయటకు వెళ్లిన సమయంలో తన గదిలోకి వెళ్లి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

    మిధున్ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం నాడే ఆ ఇంట్లో కోడలు ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మిధున్ తల్లి మాట్లాడుతూ.. ఆద్య తమతో పాటే మధ్యాహ్నం భోజనం చేసిందని.. భోజనం చేశాక తన గదిలోకి వెళ్లిందని చెప్పారు. కొంతసేపటికి గదిలో నుంచి ఏదో శబ్దం రావడంతో ఏమైందా అని ఆద్యను పిలిచామని, ఎంతసేపటికీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి డోర్ బద్ధలు కొట్టామని తెలిపారు. లోపల ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆద్య కనిపించిందని.. వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించామని.. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పినట్లు మిధున్ తల్లి చెప్పారు. మిధున్ ఇంటి నుంచి వెళ్లే సమయంలో కూడా తన కోడలు నవ్వుతూ పంపిందని.. ఇంతలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్ధం కావడం లేదని ఆద్య అత్త తెలిపారు. ఆద్య తల్లిదండ్రులు కూడా తమ కూతురు అత్తారింట్లో సంతోషంగానే ఉన్నానని చెప్పిందని, అందరూ బాగానే చూసుకుంటున్నారని ఫోన్‌లో చెప్పిందని పోలీసులకు తెలిపారు.

    ఇది కూడా చదవండి: OMG: 20 ఏళ్ల ఈ యువకుడిలో ఇన్ని పాడు ఆలోచనలా.. ఇలా రోడ్డుపై ఒంటరిగా మహిళ కనిపిస్తే ఏం చేసేవాడంటే...

    ఆద్య గతంలో ఎవరినైనా ప్రేమించిందా, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త మిధున్‌ను, అత్తమామలను కూడా విచారిస్తున్నారు. ఆద్య ఫోన్ డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు గల కారణం బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ చేసుకున్న గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. పోలీసులు ఆద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెళ్లయి రెండు నెలలు కూడా గడవక ముందే కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ఏ కష్టం వచ్చిందని ఇంత పని చేశావ్ తల్లీ’ అంటూ గుండెలవిసేలా రోదించారు. ఆమె భర్త మిధున్ కూడా భార్య మృతదేహంపై పడి వెక్కివెక్కి ఏడ్చాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Kerala, Newly Couple, Suicide hanging, Wife suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు