హోమ్ /వార్తలు /క్రైమ్ /

Aryan Khan కిడ్నాప్, రూ.18కోట్లకు SRKతో డీల్ .. సెల్ఫీతో సీన్ రివర్స్.. బీజేపీ నేత స్కెచ్: నవాబ్ మాలిక్ సంచలనం

Aryan Khan కిడ్నాప్, రూ.18కోట్లకు SRKతో డీల్ .. సెల్ఫీతో సీన్ రివర్స్.. బీజేపీ నేత స్కెచ్: నవాబ్ మాలిక్ సంచలనం

ఆర్యన్ ఖాన్

ఆర్యన్ ఖాన్

ముంబైలో డ్రగ్స్ లభించినట్లు చెబుతోన్న షిప్పులో పార్టీకి ఆర్యన్ ఖాన్ వెళ్లలేదని, పథకం ప్రకారమే అతణ్ని షిప్పు దగ్గరికి రప్పించారని, ఆర్యన్ తమ చేతికి చిక్కిన వెంటనే కిడ్నాప్ ముఠా షారూఖ్ ఖాన్ తో బేరసారాలు చేసిందని, కొంత డబ్బు కూడా ముట్టిందని, ప్లాన్ పక్కాగా అమలవుతోన్న దశలో సెల్ఫీ వల్ల కథ మొత్తం అడ్డం తిరిగిందని మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు..

ఇంకా చదవండి ...

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో అనూహ్య కోణం వెలుగులోకి వచ్చింది. ‘ముంబై క్రూయీజ్ షిప్ డ్రగ్స్ కేసు’గా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో చీకటి నిజాలు ఇవేనంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన విషయాలను చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇది డ్రగ్స్ కేసు ఏమాత్రమూ కాదని.. పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్ వ్యవహారమని మాలిక్ బాంబు పేల్చారు. డ్రగ్స్ లభించినట్లు చెబుతోన్న షిప్పులో పార్టీకి ఆర్యన్ వెళ్లలేదని, పథకం ప్రకారమే అతణ్ని షిప్పు దగ్గరికి రప్పించారని, ఆర్యన్ తమ చేతికి చిక్కిన వెంటనే కిడ్నాప్ ముఠా షారూఖ్ ఖాన్ తో బేరసారాలు చేసిందని, కొంత డబ్బు కూడా ముట్టిందని, ప్లాన్ పక్కాగా అమలవుతోన్న దశలో అనూహ్య రీతిలో బయటికొచ్చిన సెల్ఫీ వల్ల కథ మొత్తం అడ్డం తిరిగిందని మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. నిజానికి ఆ షిప్పులోకి మహారాష్ట్ర మంత్రుల పిల్లల్ని కూడా రప్పించేలా వ్యూహరచన జరిగిందని, ఈ మొత్తం వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడే పావులాంటోడైతే, అసలు సూత్రధారి మోహిత్ కంభోజ్ అనే బీజేపీ నేత అని మాలిక్ ఆరోపించారు..

డ్రగ్స్ కాదు కిడ్నాప్ కేసు

సంచలనం రేపిన ఆర్యన్ ఖాన్ కేసులో అసలేం జరిగింది, అతను పట్టుపడిన తీరు, దొరికిన తర్వాత షారూఖ్ సిబ్బందితో బేరసారాలు జరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టే వాస్తవాలను తెలియజేస్తున్నానంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన విషయాలు చెప్పారు. ఆర్యన్ ఖాన్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచీ పలు కీలక ఆధారాలను బయటపెడుతోన్న మంత్రి మాలిక్.. తాజాగా ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. అసలిది డ్రగ్స్ కేసు కాదని, భారీ మొత్తంలో డబ్బులు గుంజేందుకు పన్నిన కిడ్నాప్ వ్యూహమని చెప్పారు.

ఆర్యన్ రాలేదు.. తీసుకొచ్చారు

‘అనుమానిత డ్రగ్స్ పార్టీ జరిగినట్లు చెబుతోన్న షిప్పులోకి ఆర్యన్ ఖాన్ ఎందుకు? ఎలా వెళ్లాడు? అనే ప్రశ్నలకు ఎన్సీబీ దగ్గర సమాదానం లేదు. ఆ పార్టీకి టికెట్ కొనడంగానీ, గెస్టుల లిస్టులు ఆర్యన్ పేరుగానీ లేనేలేదు. బీజేపీ నేత మోహిత్ కాంభోజ్, ఎన్సీబీ అధికారి వాంఖడే, ఇంకొదరు ముఠాగా ఏర్పడి ఈ పథకాన్ని అమలు చేశారు. వాళ్ల సూచనల మేరకు ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నీచర్ వాలా అనే ఇద్దరు.. ఆర్యన్ ఖాన్ ను షిప్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ ఆర్యన్ ను కిడ్నాప్ చేసిన వెంటనే షారూఖ్ ఖాన్ తో బేరాలకు దిగారు. మొత్తం రూ.25కోట్లు ఇస్తే ఆర్యన్ ను విడిచిపెడతామని ముఠా చెప్పింది. చివరికి రూ.18కోట్లకు డీల్ కుదిరింది. తక్షణ బయానాగా రూ.50లక్షలను ముఠాకు అందజేశారు. డబ్బుల వ్యవహారం సాగుతుండగానే అనుకోని రీతిలో బయటికొచ్చిన సెల్ఫీ వల్ల కథ అడ్డం తిరిగింది..

ఆర్యన్ ఖాన్ తో కిరణ్ గోసావి సెల్ఫీ

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..

షిప్పు దగ్గర ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఎన్సీబీ అధికారుల ముసుగులో ఇద్దరు ప్రైవేట్ డిటెక్టివ్ లు కూడా ఉన్నారు. నిజానికి ఇదంతా ముఠా సెటప్ లో భాగమే. ఆ డిటెక్టివ్ లలో ఒకరు(గుండులో కనిపించిన కిరణ్ గోసావి) ఆర్యన్ ఖాన్ తో దిగిన సెల్ఫీ నిమిషాల్లోనే వైరలైపోయింది. ఆ సెల్ఫీ బయటపడటంతో ఇదులో ఎన్సీబీ అధికారులు కాకుండా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఆ తర్వాతే ఆర్యన్ ఖాన్ షిప్పులో ఉన్నట్లు, డ్రగ్స్ పార్టీలో పాలుపంచుకున్నట్లు కట్టుకథలతో కేసును అల్లారు. మరో ముఖ్యమైన విషయం ఏటంటే..

బీజేపీ నేత స్కెచ్.. టార్గెట్ ఇదే

ప్రైవేట్ డిటెక్టివ్ (కిరణ్ గోసావి) ఆర్యన్ ఖాన్ ను పక్కనే కూర్చొబెట్టుకుని ఫోన్ లో షారూఖ్ ప్రతినిధులతో మాట్లాడించడం కెమెరాలకు చిక్కింది. ఆ వీడియో తీసిన (ప్రభాకర్ సాయిల్) ఈ కసులో ఎన్సీబీ తరఫున సాక్షి కూడా కావడం గమనార్హం. అంటే తప్పుడు సాక్ష్యాలు, కట్టు కథల ఆధారంగానే కేసును అల్లారు. ఎందుకంటే నిజంగా ఇది కిడ్నాప్ ఉదంతం కాబట్టి. ఆర్యన్ ఖాన్ లాగే మహారాష్ట్ర కేబినెట్ మంత్రుల పిల్లలు ఇంకొందరిని కూడా ఇలా ఇరికించి, భారీ మొత్తంలో డబ్బులు గుంజేందుకు బీజేపీ నేత మోహిత్, ఎన్సీబీ అధికారి వాంఖడే వ్యూహరచన చేశారు. అంతిమంగా వీళ్ల లక్ష్యం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడమే’అని మంత్రి నవాబ్ మాలిక్ వివరించారు. కాగా,

మంత్రి నవాబ్ మాలిక్, ఆర్యన్ ఖాన్

నవాబ్ మాలిక్ ఇంట్రెస్ట్ ఏంటి?

ఆర్యన్ ఖాన్ ది కిడ్నాప్ ఉదంతమని, ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేతో కలిసి బీజేపీ నేతలు స్కెచ్ వేశారన్న ఆరోపణలపై మోహిత్ కాంభోజ్ ఘాటుగా స్పందించారు. బహుశా షారూఖ్ ఖాన్ నుంచి డబ్బులు గుంజడానికే మంత్రి నవాబ్ మాలిక్ ఇలాంటి పిట్టకథలు అల్లుతున్నాడేమో, మా వరకైతే ఎలాంటి కిడ్నాప్ ఉదంతాలతో సంబంధంలేదని బీజేపీ నేత మోహిత్ స్పష్టంచేశారు. ఆర్యన్ అరెస్టయిన రోజు అతనితోనే ఉన్న ముగ్గురు యువకులు కేసులో లేకుండా పోయారు. వారు బీజేపీ నేతకు దగ్గరి బంధువలనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే, సమీర్ వాంఖడే కులం, మతంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి నవాబ్ మాలిక్ పై పరువు నష్టం దావా దాఖలైంది. సమీర్ తండ్రే దానిని ఫైల్ చేశారు.

First published:

Tags: Aryan Khan, Aryan khan drugs case, Maharashtra, Mumbai, Shahrukh khan

ఉత్తమ కథలు