• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • ARVIND KEJRIWAL DAUGHTER HARSHITA DUPED OF RS 34000 WHILE TRYING TO SELL SOFA ONLINE SU

సీఎం కూతురికి ఝలక్.. అకౌంట్ నుంచి డబ్బులు కాజేసిన కేటుగాడు.. అసలు ఏం జరిగిందంటే..?

సీఎం కూతురికి ఝలక్.. అకౌంట్ నుంచి డబ్బులు కాజేసిన కేటుగాడు.. అసలు ఏం జరిగిందంటే..?

హర్షిత(Harshita Kejriwal)- (Image-ANI)

ఓ కేటుగాడు ఏకంగా సీఎం కూతురినే బురిడి కొట్టించాడు. తన ట్రిక్స్ ప్లే చేసిన ఆమె అకౌంట్ నుంచి డబ్బులు దోచుకున్నాడు.

  • Share this:
    ఓ కేటుగాడు ఏకంగా సీఎం కూతురినే బురిడి కొట్టించాడు. తన ట్రిక్స్ ప్లే చేసిన ఆమె అకౌంట్ నుంచి డబ్బులు దోచుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఓ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో సోఫాను అమ్మకానికి పెట్టింది. అయితే సోఫా కొనుగోలు చేస్తానని చెప్పి ఓ వ్యక్తి హర్షితను సంప్రదించాడు. తనకు సోఫా కొనేందుకు ఆసక్తి ఉన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత హర్షిత పంపిన అకౌంట్ వివరాలు సరిగా ఉన్నాయో చెక్ చేద్దామనే సాకుతో కొద్ది మొత్తాన్ని ఆమె అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం హర్షితకు ఓ క్యూఆర్‌ కోడ్‌ పంపించి.. దాన్ని స్కాన్‌ చేస్తే డీల్ ప్రకారం నిర్ణయించిన మొత్తం ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుందని చెప్పాడు. దీంతో అతడి సూచన ప్రకారం హర్షిత ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంతో ఆమె ఖాతా నుంచి రూ.20వేలు మాయమయ్యాయి.

    తన అకౌంట్ నుంచి డబ్బుల కట్ కావడంతో హర్షిత.. తనకు క్యూఆర్ కోడ్ పంపిన వ్యక్తిని నిలదీసింది. అయితే ఆ కోడ్ తప్పుగా వచ్చిందని నిందితుడు హర్షితను నమ్మించాడు. తాను మరో లింక్ పంపిస్తానని.. గతంలో చేసినట్టుగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరాడు. ఇది నమ్మిన హర్షిత ఈ సారి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా ఆమె ఖాతాను నుంచి మరో రూ. 14వేలు కట్ అయ్యాయి. మొత్తంగా 34 వేళ్ల రూపాయలను నిందితుడు హర్షిత అకౌంట్ నుంచి కాజేశాడు.

    ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ నార్త్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ అధికారులు.. ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఎప్‌ఐఆర్ నమోదు చేసినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితుడిని కనిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు