fruad friend : స్నేహితుడి భార్యపై కన్ను...అందుకోసమే..అడ్డదారులు..! చివరకు...ఇలా బుక్ అయ్యాడు...

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

fruad friend : భర్త నుండి విడిపోయిన ఓ భార్యపై, భర్త స్నేహితుడే కన్నేశాడు... భర్తతో గొడవను ఆసరా చేసుకున్న స్నేహితుడు తనను ప్రేమిస్తున్నానని , ఇద్దరం అక్రమ సంబంధం పెట్టుకుందామని వేధింపులకు గురి చేశాడు..అయితే ఈ వేధింపులకు లొంగని స్నేహితుడి భార్యపై మరో రకంగా కక్ష తీసుకున్నాడు..

  • Share this:
    స్నేహితుడి భార్యను తన సొంత  కుటుంబ సభ్యుల్లా చూడాల్సి ఓ నిందితుడు..వక్రబుద్దిని చూపించాడు..భార్యభర్తలు ఘర్షణ పడి విడిపోతే..అందుకు సానుభూతి చూపించాల్సిన వాడు ఆమె పాలిట శత్రువు అయ్యాడు..

    వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయీ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్తతో గొడవపడి విడిపోయింది. దీంతో విడిగా ఉంటున్న ఆమెపై కిషోర్ అనే తన భర్త స్నేహితుడు కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు..తనను ప్రేమిస్తున్నానని అన్నాడు. మరోవైపు ఇద్దరం కలిసి సహజీవనం చేద్దామని బ్రతిమిలాడాడు.. కాని ఆమె ఒప్పుకోలేదు..

    దీంతో ఆమెను ఎలాగైన బజారుకిడ్చాలని పన్నాగం పన్నాడు. ఆమె పరువుతో ఓ ఆట ఆడుకున్నాడు..ఆమె ఫోన్ నంబర్‌ తోపాటు ఫోటోలను సోషల్ మీడియాలో షర్ చేశాడు. కాల్‌ గర్ల్ అంటూ పోస్ట్ చేశాడు..దీంతో ఆమెకు ఫోన్ల్ రావడంతో పాటు కొంతమంది అసభ్యంగా మాట్లాడడంతో ఆమె ఆసహనానికి గురైంది..విషయాన్ని పోలీసులకు చెప్పింది.. తనతో విడిపోయిన భర్త ఇదంతా చేశాడని ఫిర్యాదు చేసింది. కాని పోలీసుల విచారణలో మాత్రం ఆయన కాదని రుజువు అయింది..

    ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది. ఇదంతా చేసింది ఆ భర్త స్నేహితుడు కిషోర్ చేశాడని తెలిసింది.. భార్యభర్తలు కలిసి ఉన్నప్పుడు ఒకసారి బాధితురాలి భర్త.. కిషోర్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ చేశాడట. అప్పుడే ఆమె నెంబర్‌ను కిషోర్ ఫీడ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ.. ఆమెను ప్రేమిస్తున్నానని, అక్రమ సంబంధం పెట్టుకుందామని అడగటం మొదలుపెట్టాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పగ తీర్చుకోవాలని, ఆమె పేరుతో ‘కాల్ గర్ల్’ అంటూ ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియోట్ చేసి ఫోన్ నంబర్‌ను అప్‌లోడ్ చేశాడు.
    Published by:yveerash yveerash
    First published: