Home /News /crime /

ARNAB GOSWAMI ARRESTED BY MUMBAI POLICE FOR ABETMENT TO SUICIDE NS

Arnab Goswami Arrest: అర్నబ్ గోస్వామి అరెస్టుకు కారణం ఆ కేసే.. వివరాలివే..

Arnab Goswami

Arnab Goswami

ముంబై పోలీసులు ఈ రోజు ఉదయం రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే 2018లో నమోదైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు.

    ముంబై పోలీసులు ఈ రోజు ఉదయం రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే 2018లో నమోదైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. అర్నబ్ పై సెక్షన్ 306పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం పోలీసులు అర్నబ్ నివాసంపై దాడులు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు.  విచారణ నిమిత్తం ఆయనను రాయగడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఆయనను విచారిస్తున్నారు.

    అయితే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు తర్వాత.. ముంబయి పోలీసులపై.. బాలీవుడ్ పై.. మహారాష్ట్ర ప్రభుత్వంపై అర్నబ్ వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అర్నబ్ పెద్ద టీఆర్పీ కుంభకోణానికి పాల్పడ్డారని ఇటీవల పోలీసులు తేల్చారు. రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠీ ఛానెల్స్ పైనా ఈ విషయంలో కేసు నమోదైంది. పలువురికి డబ్బులిచ్చి మరీ టీఆర్పీలు పెంచుకుంటున్నారని రిపబ్లిక్ టీవీపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే పోలీసులు తాజాగా అర్నబ్ ను పాత కేసులో అరెస్టు చేసినా.. తర్వాత దీనిని కూడా ముందుకు తీసుకొస్తారనే గుసగుసలు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Arrest, Mumbai Police

    తదుపరి వార్తలు