Army man Rape Attempting: ఆర్మీలో పనిచేసే ఉద్యోగికి దారుణమైన ఘటన ఎదురైంది. సహోద్యోగి భార్యను మరో జవాను అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు.
రాజస్థాన్ లో (Rajasthan) దారుణం జరిగింది. దేశాన్ని కాపాడే సైనికుడికి తీవ్ర అన్యాయం జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని.. కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. ఈ క్రమంలో అతనికి ఒక మిత్రులు ఉన్నాడు. ఈ సైనికుడి, భార్యపై మిగతా ఆర్మీ మిత్రులు కన్నేశారు. అదును కోసం వేచిచూస్తున్నారు. చివరగా ఒక రోజు బాధితురాలు.. ఇంటిలో ఉండగా ఆర్మీ కి (army man raped) చెందిన ఒక వ్యక్తి , ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
ఆమె గట్టిగా అరిచి, ప్రతి ఘటించడంతో అతను పారిపోయాడు. ఆ కుటుంబం వెంటనే తన పై అధికారులకు జరిగిన దారుణం పట్ల ఫిర్యాదు చేశారు. అధికారులు, బాధిత కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశారు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని ఆదేశించారు. ఈ ఘటన మార్చి 14 న జరిగింది. రెండు రోజుల తర్వాత జరిగిన అన్యాయాన్ని భరించలేక బాధితులు ధైర్యం చేసి పోలీసులు ఫిర్యాదు చేశారు.
తమను బెదిరించిన వారిలో సీనియర్ అధికారులు, కల్నల్ ర్యాంకు అధికారులు, మేజర్లు ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమకు ఏదైన అన్యాయం జరిగితే దానికి.. వారే కారణమని పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం ఈ సంఘటనతో జోధ్ పూర్ మిలటరీ కార్యలయంలో తీవ్ర దుమారం చెలరేగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి మహిళలపై అఘాయిత్యానికి చెందిన ఘటన తాజాగా రాజస్థాన్ లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. డచ్ దేశానికి (Dutch Woman) చెందిన ఒక కుటుంబం.. రాజస్థాన్ ను చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో.. ఖతిపుర ప్రాంతంలో ఉంటున్న బిజు మురళి ధర్ వారిని చూశాడు. ఇతను రాజస్థాన్ (Rajasthan)లో ఉంటున్నాడు. విదేశీయులకు గైడ్ గా ఉంటు వారికి సహయం చేస్తాడు. ఇక్కడ ఆయుర్వేద మసాజ్ బాగా చేస్తారని వారితో చెప్పాడు. వారిలో ఒక యువతి ఇతగాడి మాటలను నమ్మింది. ఆయుర్వేద మసాజ్ (Ayurvedic massage) తో శారీరక సమస్యలు దూరమైపోతాయని నమ్మించాడు.
అతను మసాజ్ కోసం సింధి క్యాంపులోని ఒక హోటల్ లో గదిని బుక్ చేశానని చెప్పాడు. దీంతో అతని వెనకాలే.. ఆమె కూడా వెళ్లింది. హోటల్ గదిలో ఏదో కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది.
ఇదే అవకాశంగా భావించిన బిజు మురళిధర్.. ఆమెపై లైంగిక దాడి (Man Raped On Dutch Woman) చేశాడు. ఆ తర్వాత మెల్కొన్న ఆమె తనపై జరిగిన అన్యాయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు.. కేరళలోని (Kerala Police) స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితుడుబిజు మురళిధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rajasthan