కాకినాడలో దారుణం... రూ.2 కోసం యువకుడి హత్య

ఈ సమయంలో సాంబ పక్కనే ఉన్న అతని స్నేహితుడు అప్పారావు ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడున్న కత్తితో సువర్ణరాజును పొడిచాడు.

news18-telugu
Updated: November 10, 2019, 9:44 AM IST
కాకినాడలో దారుణం... రూ.2 కోసం యువకుడి హత్య
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 10, 2019, 9:44 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం హత్య జరిగింది. రెండు రూపాయల కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంలోని వలసపాకలో చోటు చేసుకుంది. వలసపాకలో ఓ సైకిల్‌ షాపులో సువర్ణరాజు అనే యువకుడు గాలి కొట్టించుకున్నాడు. అనంతరం రెండు రూపాయల కోసం షాపు యజమాని సాంబతో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా సాంబపై చేయిచేసుకున్నాడు. ఈ సమయంలో సాంబ పక్కనే ఉన్న అతని స్నేహితుడు అప్పారావు ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడున్న కత్తితో సువర్ణరాజును పొడిచాడు. దీంతో సువర్ణరాజు అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సువర్ణరాజును ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...