హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love Marriage: నుదుటిన బొట్టు పెట్టుకుని భార్యతో సెల్ఫీ తీసుకుంటూ ఇలా ఉన్నాడా.. ఏం చేశాడంటే..

Love Marriage: నుదుటిన బొట్టు పెట్టుకుని భార్యతో సెల్ఫీ తీసుకుంటూ ఇలా ఉన్నాడా.. ఏం చేశాడంటే..

కార్తీక్, ఇందిర

కార్తీక్, ఇందిర

ప్రేమ పెళ్లిళ్లూ ఈరోజుల్లో చాలావరకూ విషాదాంతాలకే దారితీస్తున్నాయి. ప్రేమికుల్లో కొందరు పెద్దలను కాదనుకుని పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లు బాగానే ఉంటున్నారు. ఓ పాపనో, బాబో పుట్టిన కొన్నాళ్లకు భార్యతో సదరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గొడవలు పడుతున్నాడు.

ఇంకా చదవండి ...

  ఖోర్డా: ప్రేమ పెళ్లిళ్లూ ఈరోజుల్లో చాలావరకూ విషాదాంతాలకే దారితీస్తున్నాయి. ప్రేమికుల్లో కొందరు పెద్దలను కాదనుకుని పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లు బాగానే ఉంటున్నారు. ఓ పాపనో, బాబో పుట్టిన కొన్నాళ్లకు భార్యతో సదరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గొడవలు పడుతున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను చంపేంత క్రూరంగా మారుతున్నాడు. ఒడిశాలోని ఖోర్డా పరిధిలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2005లో కార్తీక్‌కు, ఇందిర ప్రియ దర్శినికి పెళ్లైంది. వీరిది ప్రేమ వివాహం. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మరింత చనువుగా ఉండేవారు. ఒక బాబు పుట్టాడు. పిల్లాడితో కలిసి కొన్నాళ్లు బాగానే ఉన్న ఈ జంట మధ్య రానురానూ పొరపచ్చాలు మొదలయ్యాయి. అయినదానికీ, కానిదానికీ గొడవ పడుతుండేవారు.

  కార్తీక్ రోజూ భార్యపై కేకలేయడం, తిట్టడం.. ఆమె అలిగి ఏడుస్తూ కూర్చోవడం.. రోజూ ఇదే ఆ ఇంట్లో జరిగేది. కార్తీక్, ఇందిర కొడుకు వయసు ఇప్పుడు 15 ఏళ్లు. తల్లిదండ్రుల గొడవలను చూస్తూనే ఆ పిల్లాడు పెరిగాడు. పదిహేడేళ్ల కార్తీక్, ఇందిర దాంపత్య జీవితంలో కొన్ని సంవత్సరాలే తీపి గుర్తులుగా ఉన్నాయి. ఇందిర ఎంతో సహనంగా వ్యవహరించినప్పటికీ తన భర్త కార్తీక్ మాత్రం సైకోలా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలోనే.. కార్తీక్, ఇందిర మధ్య అక్టోబర్ 9న అర్ధరాత్రి సమయంలో గొడవ జరిగింది. ఈసారి గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. సైకోలా మారిన కార్తీక్ క్షణికావేశంలో భార్య గొంతు కోసి ఇంట్లో నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఇందిర కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. 2.30 సమయంలో ఇందిర హత్యకు గురైందని, ఆమెను చంపేసి కార్తీక్ అక్కడి నుంచి పారిపోయాడని ఆమె మేనమామకు సమాచారం అందింది.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంత అమాయకంగా కనిపిస్తున్న నీలో ఇంత కర్కశమా.. ఇప్పుడు చూడు ఏమైందో..

  హుటాహుటిన అక్కడికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో ఇందిర విగత జీవిగా కనిపించింది. ఇందిర మేనమామ కార్తీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఇందిర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇందిర భర్త కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్లాడో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రేమ పెళ్లి చేసుకుని.. భర్త ప్రవర్తన ఇబ్బంది పెట్టినా ఇన్నేళ్లు సర్దుకుపోయిన ఇందిర జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం శోచనీయం. ఈ ఘటన జరిగిన సమయంలో ఇందిర కొడుకు మరో గదిలో నిద్రిస్తున్నట్లు సమాచారం. అతను బయటకు రాకుండా కార్తీక్ బయట గొళ్లెం పెట్టినట్లు తెలిసింది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Love marriage, Lovers, Marriage

  ఉత్తమ కథలు