Home /News /crime /

ARAKU MLA KIDARI MURDER CASE POLICE INVESTIGATE FOLLOWERS 2

అరకు ఎమ్మెల్యే కిడారి హత్య వెనుక ఇంటి దొంగ ..!

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము... మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23న అరకులోని ఓ కార్యక్రమానికి వెళ్లిన వారిని మావోయిస్టులు కాల్చి చంపారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము... మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23న అరకులోని ఓ కార్యక్రమానికి వెళ్లిన వారిని మావోయిస్టులు కాల్చి చంపారు.

కిడారి, సోమ జంట హత్యల కేసులో సుబ్బారావుతో పాటు.. గంజాయి స్మగ్లర్, గ్రామస్థాయి నాయకులు హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు.. కిడారి హత్య విషయంలో ఇదే జరిగింది. నమ్మినవారే ఆయనను నట్టేట ముంచారు. బావా బావా అంటూ అప్యాయంగా పిలిస్తూనే.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు. అరకు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు అత్యంత దారుణంగా హత్య కేసులో వాస్తవాలు బయటకొస్తున్నాయి. కిడారి హత్యకు సొంతవాళ్లే కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. బావా బావా అంటూ కిడారి చుట్టూ తిరిగే అత్యంత సన్నిహితుడే ఆయనను హతమార్చడంలో కీ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తుంది. మావోయిస్టులకు వేగుగా కిడారి బంధువులే పనిచేసినట్లు తేలింది.

    కిడారికి అత్యంత సన్నిహితుడైన సుబ్బారావు... కిడారికి సంబందించిన ప్రతీ సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేశాడు. విశాఖ జిల్లా
    డంబ్రిగూడ మారుమూల గ్రామానికి చెందిన సదరు నేత... కిడారి ప్రతీ కదలికపై మావోలకు ఉప్పందించాడు. అతని కాల్ డేటాను
    విశ్లేషించిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిసాయి. దీంతో ఆయనతో పాటు.. అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి
    తీసుకొని విచారణ చేపట్టారు. సుబ్బారావుపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. మావోయిస్టులకు సహకరించాల్సిన అవసరం
    ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మావోలు చంపుతామని బెదిరించినందుకే వారికి సహకరించానని చెప్పుకొచ్చాడు. గ్రామదర్శిని
    కార్యక్రమం నిమిత్తం లివిటిపుట్టు వెళ్లిన కిడారికి అక్కడ ఆపద ఉన్నట్లు మీకు ముందు తెలిసినప్పుడు అతడ్ని మీరెందుకు
    అడ్డుకోలేదని పోలీసులు ప్రశ్నించగా.. సుబ్బారావు నీళ్లు నమిలాడు. దీంతో పోలీసులు అతడిని మరింత గట్టిగా విచారించే పనిలో
    పడ్డారు. లివిటిపుట్టులో పర్యటించిన మావోయిస్టులకు వీరు ఆశ్రయం కూడా ఇచ్చినట్లు సమాచారం. అటవీ ప్రాంతంల ోకూడా వారిని కలవడంతోపాటు మావోలకు ఆహారాన్ని కూడా సమాకూర్చినట్లు తెలుస్తుంది.

    కిడారి, సోమ జంట హత్యల కేసులో సుబ్బారావుతో పాటు.. గంజాయి స్మగ్లర్, గ్రామస్థాయి నాయకులు హస్తమున్నట్లు పోలీసులు
    అనుమానిస్తున్నారు. వీళ్లందరికీ మావోయిస్టులతో గతంలో సంబంధాలు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడారి హత్య కేసుతో సంబంధమున్న అనుమానంతో పలువురు గ్రామస్థులను, గ్రామస్థాయి నేతలపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Crime, Maoist attack

    తదుపరి వార్తలు