PUB G : పబ్ జి ఆడొద్దన్న భర్త.. భార్య ఏం చేసిందంటే..

PUB G | అజ్మన్‌లో ఓ జంట నివసిస్తోంది. హాయిగా సాగుతున్న వీరి కాపురంలో పబ్‌ జి చిచ్చుపెట్టింది. భార్య పబ్‌జి గేమ్‌కి ఫుల్‌గా అడిక్ట్ అయింది. ఇది గమనించిన భర్త భార్యని పబ్‌ జి ఆడొద్దని కోరాడు. అంతే.. దీంతో.. భర్త తనకి విలువ ఇవ్వడం లేదని, తన ఇష్టాలను గౌరవించడంలేదంటూ

news18-telugu
Updated: May 17, 2019, 4:50 PM IST
PUB G : పబ్ జి ఆడొద్దన్న భర్త.. భార్య ఏం చేసిందంటే..
పబ్‌జీ ఆడొద్దన్న భర్త..
news18-telugu
Updated: May 17, 2019, 4:50 PM IST
పబ్ జి గేమ్.. రోజురోజుకీ ఈ ఆటలో పడి జీవితాలే నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. కొంతమంది ఈ ఆట ఆడుతూ ప్రాణాలు తీసుకుంటే మరికొంతమంది ఆట ఆడొద్దన్నందుకూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఘటన జరిగింది. అజ్మన్‌లో ఓ జంట నివసిస్తోంది. హాయిగా సాగుతున్న వీరి కాపురంలో పబ్‌ జి చిచ్చుపెట్టింది. భార్య పబ్‌జి గేమ్‌కి ఫుల్‌గా అడిక్ట్ అయింది. ఇది గమనించిన భర్త భార్యని పబ్‌ జి ఆడొద్దని కోరాడు. అంతే.. దీంతో.. భర్త తనకి విలువ ఇవ్వడం లేదని, తన ఇష్టాలను గౌరవించడంలేదంటూ అజ్మన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భార్య ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు భర్తను స్టేషన్‌కి పిలిపించి వివరణ కోరారు. వివరణలో.. భర్త తన ఆవేదననంతా వెళ్లగక్కాడు.. తాను తన భార్యని హింసించలేనది.. కేవలం ఎప్పుడు గేమ్‌లోనే మునిగిపోకుండా తమ కుటుంబసభ్యులని కూడా పట్టించుకోవాలని కోరినట్లు చెప్పాడు. చిన్నిపిల్లలా ఎప్పుడూ గేమ్ ఆడుతూ ఉంటే వచ్చిన బంధువుల ముందు చులకన అవుతామని అలా కాకుండా కుటుంబగౌరవాన్ని కాపాడాలని కోరినట్టు మాత్రమే పేర్కొన్నాడు. ఇంత చిన్న విషయానికే భార్య పోలీసుల స్టేషన్ వరకూ రావడమే కాక విడాకులు కోరిందంటూ ఏడుస్తూ వివరించాడు.

భర్త కథంతా విన్నాక.. ఏం చేయాలో తెలీక కేసును కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...