హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లి చేసుకుంటానని లోబర్చుకుని.. ముఖం చాటేసిన ఏఆర్ కానిస్టేబుల్

పెళ్లి చేసుకుంటానని లోబర్చుకుని.. ముఖం చాటేసిన ఏఆర్ కానిస్టేబుల్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

నాలుగో తరగతి కలిసి చదువుకున్నామని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడు. తీరా మరో యువతిని ఇటీవల వివాహం చేసుకున్నాడు.

అతడు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు. తనతో కలిసి నాలుగో తరగతి వరకు చదువుకున్న సహా విద్యార్థిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఆ తర్వాత ముఖం చాటేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేట ముంతాజ్ కాలేజీ సమీపంలోని క్వార్టర్స్‌లో నివసించే ఓ యువతి(23) స్థానికంగా ఉండే మెథడిస్ట్ పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదువుకుంది. ఇదే సమయంలో బడంగ్ పేటకు చెందిన శివకుమార్ రెడ్డి(28) అదే పాఠశాలలో చదివాడు. అయితే ప్రస్తుతం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ యువతికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. అనంతరం ఇద్దరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో 2018 సంవత్సరంలో ఏప్రిల్ 10న ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదేంటని అడిగితే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నెల రోజులుగా శివకుమార్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. అనుమానం వచ్చిన ఆమె ఆరా తీయగా గత జనవరి 14న అతడు మరో యువతిని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. సదరు యువతి నిలదీయడంతో తనను మర్చిపోవాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు గురువారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు.

First published:

Tags: Love, Love affair, Love cheating

ఉత్తమ కథలు