తన పై అధికారితో అసభ్య ప్రవర్తన... APSRTCలో కీచకపర్వం

ఏపీఎస్ ఆర్టీసీలో శ్రామిక్‌గా పనిచేస్తున్న అజయ్ అనే యువకుడు విజయవాడ గవర్నర్ పేట 1 బస్ డిపోలో గ్యారేజ్ శ్రామిక్‌గా పనిచేస్తున్నాడు.

news18-telugu
Updated: November 27, 2020, 9:00 PM IST
తన పై అధికారితో అసభ్య ప్రవర్తన... APSRTCలో కీచకపర్వం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘ఇప్పటి వరకు పై అధికారుల వేధింపులతో ఉద్యోగినుల ఇబ్బందులు’ అనే కథనాలు చూసి ఉంటారు. కానీ, ఇది రివర్స్. తన పై ఉద్యోగినితో ఓ శ్రామిక్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇంటికి వెళ్లి మరీ వేధించాడు. ఏపీఎస్ ఆర్టీసీలో శ్రామిక్‌గా పనిచేస్తున్న అజయ్ అనే యువకుడు విజయవాడ గవర్నర్ పేట 1 బస్ డిపోలో గ్యారేజ్ శ్రామిక్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ విషయంపై ఆమె పలుమార్లు అతడిని హెచ్చరించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇదే డిపోలో తాగిన మైకంలో సూపర్ వైజర్‌తో గొడవపడ్డాడు. దీంతోపాటు విధులకు గైర్హాజరు అవుతున్నాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తొలగించారు. అయితే, మళ్లీ వారి వద్దకు వచ్చిన అజయ్ తప్పయిపోయిందని, ఇకపై అలా చేయబోనంటూ కాళ్లా వేళ్లా పడి మళ్లీ విధుల్లో చేరాడు.

ఇంత జరిగినా కూడా ఆ ఉద్యోగినిని వేధించడం మానలేదు. ఆమెకు పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసినా కూడా వేధింపులు కొనసాగించాడు. ఓ రకంగా వేధింపులు ఎక్కువ చేశాడు. ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆమెను చంపి, తాను కూడా చస్తానంటూ బెదిరించాడు. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడికి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా విచారణ జరిపారు. అనంతరం శాఖాపరమైన విచారణకు ఆటోనగర్ డిపో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్‌ను నియమించారు. ఆయన విచారించి ఆ నివేదికను ఉన్నతాధికారులకు అప్పగించారు. ఇందులో అజయ్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్టు తేలింది. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 48 గంటలకు పైగా రిమాండ్‌లో ఉండడం, తాగిన మైకంలో పై ఉద్యోగి ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించడం, ఇతర అభియోగాలు నిరూపితం అయ్యాయని ఆ ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2020, 8:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading