• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • APSRTC BUS DRIVER DIED IN AN SUDDEN ACCIDENT WHILE BUS WAS IN MECHANIC SHOP INCIDENT HAPPENED IN PALAMANER CHITTOOR DISTRICT HSN

Chittoor: కలలో కూడా ఊహించని రీతిలో ప్రమాదం.. భార్య పేరుతో నడుపుతున్న ఆర్టీసీ బస్సే ఆ డ్రైవర్ ప్రాణం తీసింది..!

Chittoor: కలలో కూడా ఊహించని రీతిలో ప్రమాదం.. భార్య పేరుతో నడుపుతున్న ఆర్టీసీ బస్సే ఆ డ్రైవర్ ప్రాణం తీసింది..!

ప్రతీకాత్మక చిత్రం

ఓ బస్సు డ్రైవర్ కూడా ఊహించని రీతిలో మరణించాడు. ఏదో రోడ్డు ప్రమాదానికి గురయ్యో, అతి వేగం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే జరిగి ఉంటుందనుకుంటే పొరపాటే. ఇలా చనిపోతారని కలలో కూడా ఊహించని రీతిలో..

  • Share this:
    చావు ఏ రూపంలో వస్తుందో? ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరూ ఊహించలేరు. చావు కోరుకున్న వారికేమో చచ్చినా చావు రాదు. పూర్తి ఆరోగ్యంతో ఉంటూ అప్పటి వరకు ఉత్సాహంగా కనిపించిన వాళ్లను మాత్రం ఊహించని రీతిలో మృత్యువు బలి తీసుకుంటుంటుంది. గంట క్రితమే కదా నాతో మాట్లాడాడు? అప్పుడే ఎలా చనిపోయాడు? అంటూ అంతా ఆశ్చర్యపోతుంటుంటారు. అందుకే మరణ రహస్యాన్ని ఎవరూ అంచనా వేయలేరు. తాజాగా ఓ బస్సు డ్రైవర్ కూడా ఊహించని రీతిలో మరణించాడు. ఏదో రోడ్డు ప్రమాదానికి గురయ్యో, అతి వేగం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే జరిగి ఉంటుందనుకుంటే పొరపాటే. ఇలా చనిపోతారని కలలో కూడా ఊహించని రీతిలో అతడు మరణించాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    చిత్తూరు జిల్లా గంగవరం మండలం సాయినగర్ కు చెందిన 55 ఏళ్ల వెంకట మునిగౌడు అలియాస్ ఎస్‌వీఎమ్‌ గౌడు అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితమే భార్య మరణించడంతో తన కూతురితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతడు పలమనేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య శ్యామల పేరుతో ఓ ప్రైవేటు బస్సును నడుపుకుంటున్నాడు. ఇటీవల ఆ బస్సు రిపేర్ కు వచ్చింది. దీంతో ఆ బస్సును పలమనేరు సమీపంలోని ఎస్టేట్ లో రిపేర్ చేయడానికి కొద్ది రోజుల క్రితం ఇచ్చాడు. రిపేర్ చేయడం పూర్తయిందా? లేదా? అన్నది తెలుసుకోవడానికి గురువారం మెకానిక్ షాపు వద్దకు వెళ్లాడు.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    అప్పటికే బస్సును రిపేర్ చేయడానికి వెనక టైర్లను తీసేసి జాకీ రాడ్ ను మెకానిక్ అమర్చాడు. ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న వెంకట మునిగౌడ్ రిపేర్ ఎంత వరకు వచ్చిందని మెకానిక్ ను అడిగాడు. అలా అడుగుతూనే బస్సు కిందకు తొంగి చూశాడు. ఇంతలోనే బస్సుకు అమర్చిన జాకీ రాడ్ మట్టిలో ఒరిగిపోయింది. దీంతో ఆ బస్సు ప్రమాదవశాత్తు వెంకట మునిగౌడ్ పై పడింది. అతడు బస్సు కింద పడి నలిగిపోయాడు. స్థానికులు సాయంతో అక్కడ ఉన్న మెకానిక్ లు ఆ బస్సును పైకి లేపి వెంకట మునిగౌడ్ ను బయటకు తీశారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. విషయం తెలిసిన బంధువులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెంకట మునిగౌడుకు ఒక్కగానొక్క కూతురు ఉంది. తనకు దిక్కెవరు అంటూ ఆమె రోదిస్తుండటాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published: