
(ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంక్ అప్రయిజర్ భారీ మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్లో కొత్త అకౌంట్లు తెలిచి గోల్డ్ లోన్స్ తీసుకుని డబ్బు స్వాహా చేశాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్లో బంగారం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అప్రయిజర్ భారీ మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్లో కొత్త అకౌంట్లు తెలిచి గోల్డ్ లోన్స్ తీసుకుని డబ్బు స్వాహా చేశాడు. సుమారు 500 మంది ఖాతాదారుల పేరుతో దొంగ బంగారాన్ని తనఖా పెట్టి లక్షల్లో బ్యాంకుకు టోపీ పెట్టాడు. అనుమానం వచ్చి మేనేజర్ నగలు తనిఖీ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నగలు సరి చూసుకోవాలని బ్యాంక్ ఖాతాదారులకు మేనేజర్ విజ్ఞప్తి చేశారు. మేనేజర్ నుంచి మెసేజ్ రావడంతో గోల్డ్ లోన్లు తీసుకున్న వారు ఆందోళనతో బ్యాంకుకు క్యూకట్టారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:March 06, 2020, 17:18 IST