ఏపీలో నిత్య పెళ్లికూతురు.. ఏకంగా ఆరు పెళ్లిళ్లు..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకుందో మహిళ. ఒకరికి తెలీకుండా మరొకరికి టోకరా వేస్తూ, ఎదురుకట్నం తీసుకుంటూ ఘరానా మోసానికి పాల్పడుతోంది.

news18-telugu
Updated: December 18, 2019, 5:29 PM IST
ఏపీలో నిత్య పెళ్లికూతురు.. ఏకంగా ఆరు పెళ్లిళ్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకుందో మహిళ. ఒకరికి తెలీకుండా మరొకరికి టోకరా వేస్తూ, ఎదురుకట్నం తీసుకుంటూ ఘరానా మోసానికి పాల్పడుతోంది. ఏపీలోని ప్రకాశం జిల్లా మోదినీపురానికి చెందిన మౌనిక ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకొని హాట్ టాపిక్‌గా నిలిచింది. కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన రామకృష్ణారెడ్డిని 2018 మేలో మౌనిక వివాహం చేసుకుంది. అందంగా ఉందని, ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నాడు ఆ వ్యక్తి. మూడు నెలల పాటు బాగానే ఉన్నా.. ఓ రోజు మహిళ తండ్రి.. పుట్టింటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఎంతకు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తే హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. ఇక్కడ మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నట్లు గుర్తించారు.
మౌనిక, నిందితురాలు
మౌనిక, నిందితురాలు


మౌనికను అదుపులోకి తీసుకొని విచారించగా.. వీరిద్దరికంటే ముందే మరో నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. దీంతో ఆమెను, తండ్రిని, ఆరో భర్త చంటి నాయక్‌ను దోషిగా తేల్చిన కోర్టు శిక్ష విధించింది. అయితే, బెయిల్‌పై వచ్చిన మౌనిక, చంటి నాయక్ తప్పించుకొని తిరుగుతున్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.

మౌనికకు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తితో మొదట వివాహమైంది. కొన్ని రోజులకే ప్రకాశం జిల్లా పందిళ్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో రెండో పెళ్లి జరిగింది. మూడో వివాహం గిద్దలూరుకు చెందిన వ్యక్తితో. నాలుగో తంతులో తెనాలికి చెందిన వ్యక్తిని మోసం చేసింది. రామకృష్ణారెడ్డితో జరిగింది ఐదో వివాహం. ఇతన్ని వదిలేశాక చంటినాయక్‌ను పెళ్లి చేసుకుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 18, 2019, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading