ఏపీలో చైన్‌స్నాచర్‌గా మారిన వార్డు వాలంటీర్

పరారీలో ఉన్న వార్డు వాలంటీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

news18-telugu
Updated: November 19, 2019, 9:44 AM IST
ఏపీలో చైన్‌స్నాచర్‌గా మారిన వార్డు వాలంటీర్
నమూనా చిత్రం
  • Share this:
ఏపీలో ఓ వార్డు వాలంటీర్.. దొంగగా మారాడు. వృద్ధురాల్ని మాటల్లో పెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుల్ని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జగ్గయ్యపేటలో ఆకులవారి వీధికి చెందిన నరేష్ అనే యువకుడు వాలంటీర్ ఉద్యోగంలో చేరాడు. వరలక్ష్మీ అనే  వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ చెప్పాడు. నరేష్ మాటలు నమ్మిన ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో ఉన్న నల్లపూసల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు  ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వార్డు వాలంటీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...