ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: January 6, 2020, 12:19 PM IST
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలోని అనంతపురం జిల్లాలోని గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. జిల్లాలోని కనేకల్ పంచాయతీలో గ్రామ సచివాలయ కార్యదర్శిగా 22 ఏళ్ల నందిని కొన్ని నెలలుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె నేడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నందిని ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. గత ఏడాది జరిగిన గ్రామ సచివాలయ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన నందిని... గ్రామ కార్యదర్శి పోస్టుకు ఎంపికైంది. అయితే ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.




First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు