ఇసుక అక్రమ రవాణా కేసులో తొలి శిక్ష అమలు.. జగన్ సొంత జిల్లాలోనే..

ప్రతి వ్యక్తి అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్‌–2లో పర్మిట్‌(సమయం, తేదీలతో)ను ఇస్తారు. రీచ్‌ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.

AP Sand Policy : అక్రమ రవాణా కేసులో తొలి శిక్ష అమలైంది. అదీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కావడం గమనార్హం. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లె గ్రామంలో ఇసుక అక్రమ రవాణా కేసు నమోదైంది.

 • Share this:
  ఏపీలో ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇసుక ధరలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చర్చలు తీసుకున్న ప్రభుత్వం
  ఇసుక అక్రమ రవాణాకు ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబరును కూడా సీఎం జగన్ ప్రారంభించారు. అయితే.. అక్రమంగా ఇసుక రవాణా చేపడితే.. రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా, అక్రమ రవాణా కేసులో తొలి శిక్ష అమలైంది. అదీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కావడం గమనార్హం. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లె గ్రామంలో ఇసుక అక్రమ రవాణా కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కడప మెజిస్ట్రేట్ నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

  కాగా, ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత సమస్య ఉన్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించిన జగన్ ప్రభుత్వం.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అక్రమంగా రవాణా చేస్తే బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నిందితులను కఠిన శిక్ష విధించడం గమనార్హం.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: