వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత పోస్టింగ్‌లు... యువకుడి అరెస్ట్

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య పోస్టులు పెట్టిన ప్రకాశం జిల్లా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురానికి చెందిన పునుగుపాటి రమేశ్... కొద్దిరోజుల క్రితం వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు పెట్టాడు.

news18-telugu
Updated: August 14, 2019, 1:52 PM IST
వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత పోస్టింగ్‌లు... యువకుడి అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియాలో నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు ఏపీ పోలీసులు. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్‌పై ఇలాంటి రకమైన పోస్టులు పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... తాజాగా వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య పోస్టులు పెట్టిన ప్రకాశం జిల్లా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురానికి చెందిన పునుగుపాటి రమేశ్... వైసీపీమహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు పెట్టాడు. గతంలోనే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు రమేశ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అతడి కోసం ప్రకాశంలో విస్తృతంగా గాలించిన పోలీసులు... ఆ తర్వాత నెల్లూరు, కోయంబత్తూరు, సేలం, చెన్నై, బెంగళూరులోనూ వెతికారు. అయితే తాజాగా రమేశ్‌ను గుంటూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నుంచి తప్పించుకునే అంశంపై న్యాయవాదితో చర్చించేందుకు రమేశ్ గుంటూరు వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు... రైల్వే స్టేషన్‌లోనే అతడిని పట్టుకోవాలని భావించారు. అనుకున్నట్టుగానే రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే అతడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.


First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు