Home /News /crime /

AP MAHESH BANK SERVERS HACKED RS 13 CR TRANSFERRED DGM CLARIFIES THAT ALL CUSTOMERS PERSONAL ACCOUNTS ARE SAFE MKS

AP Mahesh Bank : భారీ దోపిడీ : కస్టమర్ల ఖాతాలు హ్యాక్ కాలేదన్న మహేశ్ బ్యాంక్ డీజీఎం బద్రీనాథ్

హైదరాబాద్ లోని మహేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం

హైదరాబాద్ లోని మహేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం

ప్రఖ్యాత ఏపీ మహేశ్ బ్యాంక్ సర్వన్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.12.90కోట్లను కొల్లగొట్టడం తెలిసిందే. అయితే కస్టమర్ల వ్యక్తిగత ఖాతాలేవీ హ్యాక్ కాలేదని, బ్యాంకు ఖాతాలనే నేరగాళ్లు టార్గెట్ చేశారని మహేశ్ బ్యాంక్ డీజీఎం బద్రీనాథ్ తెలిపారు..

ఇంకా చదవండి ...
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన భారీ బ్యాంకు దోపిడీ ఘటనలో కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుపై సైబర్‌ నేరగాళ్లు పంజా విసరడం, బంజారాహిల్స్‌లోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలోని సర్వర్‌లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేయడం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించి కొంత డబ్బును కాపాడగలిగారు. కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బ్యాంకుపై సైబర్ నేరగాళ్ల దాడి, డబ్బుల దోపిడీపై మహేశ్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం) బద్రీనాథ్ కీలక వివరణ ఇచ్చారు.

సైబర్ నేరగాళ్లు బ్యాంకు సెలవు రోజుల్లో సర్వర్ ను హ్యాక్ చేశారని, హ్యాకింగ్ ను గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు వేగంగా స్పందించి కొన్ని ఖాతాలను బ్లాక్ చేశారని మహేశ్ బ్యాంక్ డీజీఎం బద్రీనాథ్ తెలిపారు. మొత్తంగా సైబర్ నేరగాళ్లు రూ.12.90 కోట్లను ఇతర ఖాతాలకు బదిలీ చేశారని, అయితే మహేశ్ బ్యాంకు కస్టమర్ల వ్యక్తిగత ఖాతాలు మాత్రం హ్యాక్ కాలేదని, తమ బ్యాంక్ ఖాతా నుంచి ఇతర బ్యాంకులకు డబ్బు వెళ్లిందని బద్రీనాథ్ వివరించారు. హ్యాకింగ్ ఉదంతంపై ఐటీ నిపుణులు పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

AP Mahesh Bank : భారీ దోపిడీ -మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి.. రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లుమహేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం సర్వర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.12.90 కోట్లు కొల్లగొట్టి, ముగ్గురి ఖాతాల్లోకి ఆ నగదును బదిలీచేసి.. అక్కడి నుంచి ఢిల్లీ, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు జాతీయ, కార్పొరేట్‌ బ్యాంకుల్లోని 128 ఖాతాలకు జమ చేశారు. నగదు నిల్వలు తగ్గినట్లు గుర్తించిన మహేశ్‌ బ్యాంకు ప్రతినిధులు ఆదివారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Nizamabad: పసుపు మంటలు : బీజేపీ ఎంపీ అర్వింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి.. ఉద్రిక్తతబ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కు గురై, నగదు విత్ డ్రా అవుతోందన్న బ్యాంకు వారి ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు నమోదు చేసి కార్పొరేటు, జాతీయ బ్యాంకుల ఐటీ విభాగాలను అప్రమత్తం చేశారు. దీంతో కనీసం రూ2.50కోట్ల నగదును విత్‌డ్రా చేసుకోకుండా స్తంభింపజేశారు. నేరం జరిగిన తీరును బట్టి ఇది నైజీరియన్ ముఠా పనే అయిఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ 16గంటల్లో నేరస్థులు ఇదంతా చేశారని ప్రాథమిక సమాచారం సేకరించారు.

Sangareddy: ఈ బుడ్డోడి సమయస్ఫూర్తి ఓ ప్రాణాన్ని కాపాడింది.. ఆన్‌లైన్ క్లాసులు ఇలా కూడా ఉపయోగపడతాయి!నగదు నిల్వలు తగ్గినట్లు ఏపీ మహేశ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ఆదివారం రాత్రి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా రాత్రి 11 గంటలకు ఎస్సై మదన్‌ ఠాణాకు చేరుకున్నారు. బ్యాంకు వివరాలన్నీ సేకరించి రాత్రి వేళల్లోనూ పనిచేస్తున్న వేర్వేరు ఐటీ విభాగాలకు సమాచారం పంపి నగదు నిల్వలను స్తంభింపజేయాలని కోరారు. రూ.12.90 కోట్లు వెళ్లిన బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించి హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లిన బ్యాంక్‌ ఖాతాల ఐపీ చిరునామాల ఆధారంగా ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి నగదు బదిలీ ఆపాలంటూ కోరారు. రూ.2.50కోట్లు విత్‌డ్రా కాకుండా ఆపారు.

IAS Cadre Rules: కేంద్రంపై విపక్ష సీఎంల గగ్గోలు -PM Modiకి సంచలన లేఖ రాసిన CM KCRబ్యాంక్‌లో నగదు కొల్లగొట్టింది ఒక్కడేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. నేరస్థుడు బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించి హ్యాక్‌ చేయడం ద్వారా రూ.12.90 కోట్లు స్వాహా చేసేంతవరకూ పక్కా ప్రణాళికతో వ్యవహరించాడని తెలుసుకున్నారు. నాలుగో శనివారం, ఆదివారం బ్యాంక్‌కు సెలవు కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోరన్న అంచనాతో శనివారాన్ని ఎంచుకున్నాడని గుర్తించారు. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, పొదుపు, కరెంట్‌ ఖాతాల వివరాలు, నగదు బదిలీకి అవసరమైన సాంకేతికతను సమకూర్చుకున్నాడని తేల్చారు.

Jagtial triple murder case: అతడు సినిమా ఫక్కీలో.. కేసు ఖర్చులకు రూ.50 లక్షలు చీటి వేసిమరీ హత్యలు..బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌లో కొన్ని అంశాలను సైబర్‌ నేరస్థుడు తెలుసుకున్నాడు. డబ్బు కొట్టేసేందుకు వ్యవస్థలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు. మహేశ్‌ బ్యాంక్‌ ఖాతాదారుల్లో ముగ్గురిని సైబర్‌ నేరస్థుడు ఎంచుకున్నాడు. వీరిలో ఒకరు మహిళ. ఆమెది సేవింగ్స్‌ ఖాతా కాగా మరో ఇద్దరికి కరెంట్‌ ఖాతాలున్నాయి. ముందుగా ఈ ముగ్గురి ఖాతాల్లోకి ప్రధాన సర్వర్‌లోంచి రూ.12.90 కోట్ల బదిలీకినెట్‌ బ్యాంకింగ్‌ గరిష్ఠ పరిమితిని రూ.50 కోట్ల వరకు మార్చేశాడు.

Kalvakuntla Kavitha : కమలం దూకుడుకు గులాబీ కళ్లెం.. cm kcr కూతురు కవితే అస్త్రం!ముగ్గురి ఖాతాల్లోకి నగదు జమకాగానే సంక్షిప్త సందేశాల వ్యవస్థలోకీ చొరబడి వారినంబర్లను మార్చేశాడు. అనుకున్న మొత్తాన్ని మూడు ఖాతాల్లోకి జమ చేసుకున్నాక. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రోజుకు జరిపే లావాదేవీల సంఖ్యను మార్చేశాడు. అనంతరం మూడు ఖాతాల్లోంచి దిల్లీ, ఝార్ఖండ్‌, బిహార్‌, అస్సాం, మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని వేర్వేరు బ్యాంకుల్లోని ఖాతాలకు రూ.12.90 కోట్ల నగదును జమ చేశాడు.
Published by:Madhu Kota
First published:

Tags: Bank, Hacking, Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు