హోమ్ /వార్తలు /క్రైమ్ /

లాక్‌డౌన్ వల్ల ప్రియుడిని కలవలేక... భర్తను చంపేసి భార్య పరార్..

లాక్‌డౌన్ వల్ల ప్రియుడిని కలవలేక... భర్తను చంపేసి భార్య పరార్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో భర్త 24 గంటలు ఇంటి వద్దే ఉంటున్నాడు. దాంతో వాళ్లు కలుసుకోవడానికి వీలుపడడం లేదు. ఈ క్రమంలో నాగరాజు అడ్డును తొలగించుకునేందుకు సురేష్, భూలక్ష్మి ప్లాన్ చేశారు.

  భర్త ఉన్నప్పటికీ ఓ మహిళ మరొక వ్యక్తితో ప్రేమాయాణం సాగిస్తోంది. అప్పుడప్పుడూ భర్తకు తెలియకుండా అతడిని కలిసేది. అలా కొన్ని రోజులుగా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఐతే లాక్‌డౌన్ వల్ల కొన్నిరోజులుగా భర్త ఇంట్లోనే ఉంటుండడంతో.. ఆమెకు తన ప్రియుడిని కలిసేందుకు కుదరడం లేదు. ఈ క్రమంలో ఎలాగైన భర్త అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ చేసి.. పక్కాగా అమలు చేసింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన నాగరాజు (38)తో భూలక్ష్మికి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. త్రీటౌన్ పరిధిలోని రాఘవ ఎస్టేట్స్‌లో నాగరాజు దంపతులు తాపీపనులు చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఐతే వట్లూరు ప్రాంతానికి చెందిన తోకల సురేష్ అనే వ్యక్తి నాగరాజు వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాగరాజు భార్యతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా తరచూ వీళ్లు కలిసేవారు.

  ఐతే లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో భర్త 24 గంటలు ఇంటి వద్దే ఉంటున్నాడు. దాంతో వాళ్లు కలుసుకోవడానికి వీలుపడడం లేదు. ఈ క్రమంలో నాగరాజు అడ్డును తొలగించుకునేందుకు సురేష్, భూలక్ష్మి ప్లాన్ చేశారు. బుధవారం రాత్రి భోజనం చేశాక అందరూ నిద్రిస్తున్న సమయంలో... నాగరాజు తలపై సురేష్ ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. అందుకు భూలక్ష్మి సహరించింది. తలపై బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు. అతడు మరణించాడని నిర్ధారించుకున్నాక సురేష్‌తో కలిసి భూలక్ష్మి పారిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకేసు నమోదుచేసి నిందితల కోసం గాలిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Eluru, Murder, West Godavari

  ఉత్తమ కథలు