వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబుకు నోటీసులు

చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్లకూ కూడా నోటీసులు పంపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: January 9, 2020, 3:07 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబుకు నోటీసులు
చంద్రబాబు, వైఎస్ వివేకానందరెడ్డి
  • Share this:
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్లకూ కూడా నోటీసులు పంపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక అప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీ రామ్ హామీని హైకోర్టు నమోదు చేసింది. దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూనే... సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

వైఎస్ వివేకానందరెడ్డిని మార్చి 15న పులివెందులో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకా నివాసంలోనే నరికి చంపారు. ఆయన మృతదేహంపై తల, చేతులు సహా పలు భాగాల్లో బలమైన గాయాలు ఉన్నాయి. గొడ్డలి లేదా వేటకొడవలితో ఆయనపై దాడిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ సంచలనం రేపిన ఈ కేసును ఏపీ పోలీసుల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సిట్‌ను రద్దు చేసి మరో సిట్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. 1400 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వివేకా హత్యపై కూపీలాగుతున్నారు.
First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు