వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తి.. రిజర్వులో తీర్పు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ పూర్తయ్యింది. అయితే.. తీర్పును రిజర్వులో ఉంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: February 24, 2020, 5:14 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తి.. రిజర్వులో తీర్పు..
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
  • Share this:
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ పూర్తయ్యింది. అయితే.. తీర్పును రిజర్వులో ఉంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వివేకా శవ పరీక్ష నివేదిక, జనరల్ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. దర్యాప్తుకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించగా.. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా, గతంలో సీఎం జగన్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే.. దానిపై వివేకా కుమార్తె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె తరఫు లాయర్లు కోర్టును కోరారు. సునీతతో పాటు టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో పిటిషన్ వేశారు. ప్రభుత్వం మాత్రం వివేకా హత్య కేసులో విచారణ ముగింపు దశకు చేరుకుందని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని చెప్పింది. సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించింది. అయితే.. తాజాగా తీర్పును కోర్టు రిజర్వులో ఉంచడం గమనార్హం.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు